Begin typing your search above and press return to search.
హైదరాబాద్ శివారు.. గెలుపెవరిదీ.?
By: Tupaki Desk | 5 Dec 2018 10:51 AM GMTతెలంగాణ ఎన్నికల బరి ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ శివారు నియోజకవర్గాలు మినీ ఇండియాగా పేరొందాయి. ఇక్కడికి దేశంలోని చాలా మంది వచ్చి స్థిరపడ్డారు. విద్యా, ఉద్యోగం, వ్యాపారం కోసం చాలా మంది వచ్చి స్థిరపడ్డారు. ఏపీకి చెందిన సెటిలర్ల శాతం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ శివారు హైదరాబాద్ నియోజకవర్గాలు ఎవరిపరం అవుతాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
* ఐటీ అడ్డా శేరిలింగపల్లిలో గెలిచేదెవరు?
ఐటీ అడ్డాగా.. అనేక దేశ విదేశీ కంపెనీలకు నెలవైన శివారు శేరిలింగపల్లిలో దేశ, విదేశీ జనాభా ఎక్కువ. ఆంధ్రా సెటిలర్ల శాతం కూడా ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ టీఆర్ఎస్ తరుఫున బరిలో ఉన్నారు. ఇక్కడున్న పది టీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఆయన బలంగా ఉన్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన ఆనంద్ ప్రసాద్ నిలబడ్డారు. కానీ కాంగ్రెస్ రెబల్ బరిలో ఉండడం ఆయనకు ఇబ్బందిగా మారింది.
*కూకట్ పల్లిలో సుహాసిని నిలిచేనా..
ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కూకట్ పల్లిలో ప్రధానంగా ప్రజాకూటమి తరుఫున టీడీపీ అభ్యర్థి సుహాసిని, టీఆర్ఎస్ తరుఫున మాధవరం కృష్ణారావు, బీఎస్పీ అభ్యర్థి హరీష్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ రెబల్ అభ్యర్థి హరీష్ రెడ్డి క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ కు విజయావకాశాలున్నాయి. సుహాసినికి క్షేత్రస్థాయి బలంగా లేకపోవడం మైనస్ గా మారాయి.
*రాజేంద్రనగర్ లో టఫ్ ఫైట్
పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన రాజేంద్రనగర్ లో టీఆర్ఎస్ తరుఫున తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీజేపీ నుంచి సీనియర్ బద్ద బల్లంరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డిల మధ్య రసవత్తరంగా మారింది. వీరు ముగ్గురికే విజయావకాశాలున్నాయట..
*మల్కాజ్ గిరిలో ఆసక్తికరం
వలసవాదులతో నిండిన మల్కాజ్ గిరి నియోజకవర్గం మినీ ఇండియాగా పేరొందింది. ఉత్తర, దక్షిణ, తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ చాలా మంది స్థిరపడ్డారు. టీఆర్ఎస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, టీజేఎస్ నుంచి దిలీప్ కుమార్, బీజేపీ నుంచి రామచంద్రరావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ , టీడీపీ నేతలు టీజేఎస్ కు సహకరించకపోవడం ఇక్కడ మైనస్ గా ఉంది. టీఆర్ఎస్ మైనంపల్లి క్షేత్రస్థాయిలో బలంగా దూసుకుపోతున్నారు.
* ఎల్బీనగర్ లో భీకరపోరు
ఎల్బీనగర్ లో కూటమి తరుఫున కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గౌడ్ ల మధ్య హోరాహోరీ నెలకొంది. బీజేపీ నుంచి పేరాల శేఖర్ రావు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ కు ఇక్కడ 11 మంది కార్పొరేటర్లు ఉండడంతో ఆ పార్టీ గెలుపుపై ఆశావాహంతో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి టఫ్ ఫైట్ ఇస్తున్నారు..
*ఉప్పల్ లో బీజేపీ నిలిచేనా.?
ఉప్పల్ లో తాజామాజీ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బరిలో ఉన్నారు. ఈయనకు పోటీగా టీఆర్ఎస్ నుంచి భేతి సుభాష్ రెడ్డి , టీడీపీ నుంచి వీరేందర్ గౌడ్ బరిలో ఉన్నారు. కాగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నట్టు సమాచారం.
*కుత్భుల్లాపూర్ లో ఇద్దరి మధ్యే..
కార్మికులు, పారిశ్రామికవాడలు ఎక్కువున్న ప్రాంతం కుత్బుల్లాపూర్. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుఫున కూన శ్రీశైలం గౌడ్, టీఆర్ఎస్ నుంచి కూన వివేక్ గౌడ్ లు బరిలో ఉన్నారు. ఇక్కడ 2 లక్షల సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఇక్కడ టఫ్ ఫైట్ నెలకొంది.