Begin typing your search above and press return to search.
ఇటు తిరుమల...అటు పుష్కరఘాట్..సీఎంకు తెలియనివా ఇవి?
By: Tupaki Desk | 4 Dec 2019 3:21 PM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇటు తిరుమలలో, అటు కృష్ణా నది ఒడ్డున మతమార్పిడులు జరుగుతుంటే..ఏపీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మానికి నష్టం జరిగితే తప్పకుండా స్పందిస్తానని పవన్ పేర్కొన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందనే వార్తలు అత్యంత దారుణమని పవన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌కు తెలియకుండా, మాత మార్పిడి జరుగుతుందా అని పవన్ ప్రశ్నించారు. ఎవరి అండ చూసుకొని మత మార్పిడులు జరుగుతున్నాయని పవన్ ప్రశ్నించారు.
కాగా, కృష్ణా నది పున్నమిఘాట్ ఉదంతంపై కూడా పవన్ స్పందించారు. హిందూ భక్తుల నదీ స్నానాల కోసం, పుష్కరాల కోసం ఇంద్రకీలాద్రి పుణ్యస్థలిలో నిర్మించిన పున్నమిఘాట్ లో హిందూయేతర మతస్తులు.. మత మార్పిడికి పాల్పడుతుంటే వై.ఎస్.ఆర్. ప్రభుత్వం ఏం చేస్తోందని పవన్ ప్రశ్నించారు. పున్నమి ఘాట్ ను హిందువుల కోసం నిర్మించిన సంగతి ప్రభుత్వంలోని మంత్రులకు, హిందూ ఆలయాల కోసం ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ మంత్రికి తెలియదా? అని పవన్ వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి ఇంటికి అయిదు కిలోమీటర్ల దూరంలో, దేవాదాయ శాఖ మంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఘాట్లో సోమవారం ఒక్క రోజునే 42 మందికి మత మార్పిడి చేశారని, గత వారం రోజులుగా వందమందికి పైగా మత మార్పిడి చేశారని పేర్కొన్న పవన్...ఇదేనా హిందూ మతానికి మీరు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు. ఒక మతానికి సంబంధించిన పుణ్య స్థలంలో వేరే మతం వారు మత మార్పిళ్లకి పాల్పడుతుంటే దేవాదాయ శాఖ ఏమి చేస్తోందని ఆన నిలదీశారు. ఏ ప్రార్ధన స్థలమైన సరే ఆ మతాచారం ప్రకారం గౌరవించవలసిందేనని జనసేన విశ్వసిస్తోందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణపై తన వ్యాఖ్యలు వక్రీకరించారని పవన్ పేర్కొన్నారు.
అత్యధిక సీట్లు గెలుచుకొన్న సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ పరిపాలనలో విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ధరల నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి గాలికి వదిలేసి.. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని కూల్చివేయడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. యలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినా వెనుకబాటుతనం ఉండటం వారి నిర్లక్ష్యమే అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.