Begin typing your search above and press return to search.
గూగుల్ ట్రెండ్స్: ఈ నెల ఏం వెతికారో తెలుసా?
By: Tupaki Desk | 10 April 2020 11:30 PM GMTమాములుగా అయితే దేశంలో ఎప్పుడూ ఏదో ఒకటి ట్రెండింగ్లో ఉంటుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు అది ట్రెండింగ్. ఇక ట్రంప్ ఇండియాకొస్తే అది ట్రెండింగ్. కానీ కరోనా వైరస్ తో లాక్ డౌన్ తో మొత్తం కరోనానే ట్రెండింగ్ గా మారింది.
కరోనాతో ప్రపంచమే లాక్ డౌన్ అయిన వేల మొత్తం దాని గురించే ట్రెండ్స్ వచ్చినట్టు తాజాగా గూగుల్ మార్చి ట్రెండింగ్స్ చెబుతున్నాయి.
కరోనా విజృంభిస్తున్న వేళ.. మొత్తం దాని గురించే జనాలు గూగుల్ లో వెతకడం విశేషం. కరోనా ఎన్ని కేసులు.. ఎలా టెస్ట్ చేసుకోవాలి.? జాగ్రత్తలు , కరోనా వైరస్ ఎంతకాలం ఉంటుంది.? ఇలా అన్ని ప్రశ్నలు గూగుల్ సెర్చ్ లో టాప్ లో ఉన్నాయట.. ఇక హెల్త్ కేర్ విభాగంలోని ఎమర్జెన్సీ హెల్త్ కేర్ బినిఫెట్స్ - సీడీసీ హెల్త్ కేర్ వర్కర్ల గైడ్ లైన్స్ పై జనాలు ఎక్కువగా గూగుల్ లో వెతికారట..
ఇక సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ లో అత్యధికంగా వెతికిన హిందీ సినిమా బాగీ 3 కావడం గమనార్హం. తర్వాతి స్థానాల్లో కాంటేజియాన్ - అవుట్ బ్రేక్ - మార్వెల్ సినిమాలు కూడా టాప్ లో నిలిచాయి.
ఇక నివారణ చర్యలపై కూడా బాగానే వెతికారు.. మాస్క్ లు - హ్యాండ్ శానిటైజర్లు - టాయ్ లెట్ పేపర్ ఎలా చేయాలనే దానిపై కూడా గూగుల్ లో వెతకడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్ చూస్తే ఇటలీవాసులు ఎక్కువగా కరోనా గురించి ఆరాతీశారు. స్పెయిన్ - ఐర్లాండ్ - బ్రిటన్ - ఫ్రాన్స్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్ లోని ముంబై - బెంగళూరు వాసులు ఆరు - తొమ్మిదో స్థానాల్లో అత్యధికంగా వెతికినట్టు గూగుల్ ట్రెండ్స్ లో ఉంది.