Begin typing your search above and press return to search.

9 గంటలు సాగిన టీ కాబినెట్ భేటీలో తీర్మానాలు ఏమంటే?

By:  Tupaki Desk   |   6 Aug 2020 4:15 AM GMT
9 గంటలు సాగిన టీ కాబినెట్ భేటీలో తీర్మానాలు ఏమంటే?
X
ఏం చేసినా తన ముద్రను పక్కాగా వేసే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. దేశంలో చాలానే రాష్ట్ర ప్రభుత్వాలు ఉండొచ్చు.కానీ.. మరెక్కడా కనిపించని రీతిలో కాబినెట్ సమావేశం తొమ్మిది గంటల పాటు సాగేది ఒక్క తెలంగాణలోనే. నిజానికి అన్ని గంటల పాటు సమావేశం జరుగుతుందని కొన్ని రాష్ట్రాల్లోని నేతలకు చెబితే వారు నమ్మరేమో? బుధవారం సాగిన కేబినెట్ భేటీ మధ్యాహ్నం రెండు గంటలకు షురూ అయి ఏకంగా రాత్రి పదకొండు గంటల వరకు సాగటం గమనార్హం. నాన్ స్టాప్ గా సాగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరపటమే కాదు.. పలు నిర్ణయాల్ని తీసుకన్నారు.

కరోనా వేళ.. రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులతో పాటు.. రానున్న కాలంలోచేపట్టాల్సిన చర్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ప్రభుత్వ ప్రాధామ్యాల మీద భారీ కసరత్తు జరిగినట్లుగా చెప్పాలి. ఈ సందర్భంగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్ని చూస్తే..

- కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి పచ్చజెండా

- తాజాగా సిద్ధం చేసిన డిజైన్ కు ఓకే

- కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు చికిత్స చేసే విషయంలో మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలి

- హైదరాబాద్ లో కేసులు తగ్గుతున్న వేళ.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

- ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎన్ని కేసులు వచ్చినా వైద్యం చేస్తాం

- ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు.. పరికరాలు.. వసతుల కోసం ఎంత ఖర్చు కైనా వెనుకాడం

- అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్.. డెక్సామితజోన్ ఇంజెక్షన్లు.. ఫావిపిరావిర్ టాబ్లెట్లు.. ఇతర మందులు.. పిపిఈ కిట్లు.. టెస్టు కిట్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావాలి

- పాజిటివ్ అని తేలిన వెంటనే.. హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వాలి.

- పది లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలి

- తెలంగాణ వ్యాప్తంగా 10వేల ఆక్సిజెన్ బెడ్లను రెఢీ చేయాలి

- ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉంటే.. తాత్కాలిక పద్దతిలో నియమించేందుకు కలెక్టర్లకు అధికారం

- కోవిడ్ చికిత్స చేసే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి

- ప్రభుత్వం విడుదల చేసిన రూ.వంద కోట్లకు అదనంగా మరో రూ.వంద కోట్లు విడుదల

- వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేసే నెలవారీ నిధుల్ని కచ్ఛితంగా విడుదల చేయాలి

- ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న వారికి కావాల్సిన మందులు.. ఇంజక్షన్లు.. భోజనాల ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుంది.

- రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు పెట్టాలి. ఇందుకు సమగ్ర విధానం రూపకల్పన

- వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు

- భవన నిర్మాణ అనుమతుల్ని సరళతరం చేసేలా రూపొందించిన టీఎస్- బీపాస్ పాలసీకి ఆమోదం

- మున్సిపాలిటీ.. పంచాయితీలు.. ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లుల్ని ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాలి

- నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు.

- కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్ని అనుసరించి పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలి. అందుకు దూరదర్శన్ వినియోగించుకోవాలి.

- అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపకల్పన

- డిగ్రీ.. పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి

- ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాల్ని అమ్మేయాలి

- కరోనా నేపథ్యంలో ఈసారి స్వాంతంత్య్ర వేడుకల్ని నిరాడంబరంగా నిర్వహించాలి

- దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ తీర్మానం.