Begin typing your search above and press return to search.
దేశాన్ని సర్వ నాశనం చేస్తోంది వారే: సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 10 Nov 2022 7:22 AM GMTఅవినీతిపరులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశాన్ని సర్వనాశనం చేస్తోంది వారేనని మండిపడింది. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతోనే కేసుల నుంచి బయటపడుతున్నారని వ్యాఖ్యానించింది. ఎంత అవినీతికి పాల్పడినా ధనబలంతో కొందరు సునాయాసంగా తప్పించుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎవరైనా మనల్ని తప్పుపట్టడంలో తప్పు లేదని వ్యాఖ్యానించింది.
ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టై జైలుశిక్ష అనుభవిస్తున్న గౌతమ్ నవ్‌లఖా.. తనను జుడిషియల్ కస్టడీలో కాకుండా ఆరోగ్య సమస్యల దృష్ట్యా గృహనిర్బంధం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనను నిర్బంధించిన ముంబయిలోని తలోజా జైలులో కనీస సౌకర్యాలు కానీ, వైద్య సదుపాయాలు కానీ లేవని నవ్‌లఖా తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ వాదనలకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. నవ్‌లఖా దేశాన్ని నాశనం చేయాలనుకొంటున్నారని న్యాయస్థానానికి నివేదించారు.
దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసఫ్, జస్టిస్ హృషికేశ్‌రాయ్ ధర్మాసనం స్పందిస్తూ.. 'మీరు నిజంగా దేశాన్ని నాశనం చేస్తున్నవారెవరో తెలుసుకోవాలనుకొంటున్నారా? దేశాన్ని ధ్వంసం చేస్తోంది అవినీతి పరులే' అని మండిపడింది. ఈ అవినీతి పరుల మీద ఎవరు చర్య తీసుకుంటున్నారని నిస్సహాయత వ్యక్తం చేసింది. అవినీతిపరులను కాపాడుతున్నామని ఎవరైనా ఆరోపిస్తే కాదనలేం అంటూ కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఈ అవినీతిపరులు మన ప్రజాప్రతినిధులను కొనేయడానికి కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచుకున్నామని మాట్లాడుతున్న వీడియోలను కూడా అందరూ చూశారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అవినీతిపరులు దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని మనం చెప్పగలమా అని ప్రశ్నించింది.
ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలపై అదనపు సొలిసిటర్ జనరల్ రాజు స్పందిస్తూ తాను అవినీతిపరులను సమర్థించడం లేదనీ, వారిపై చర్యలు తీసుకోవాలంటున్నానని నివేదించారు. 70 ఏళ్ల నవ్‌లఖాను జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చడానికి షరతులు, సూచనలను రాజు వివరించాలని సుప్రీంకోర్టు సూచించింది. కనీసం కొంతకాలం గృహ నిర్బంధంలో ఉంచి చూద్దామంది. అతడు ఏదైనా తప్పు చేస్తే మళ్లీ జైలుకు పంపవచ్చని తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.