Begin typing your search above and press return to search.
టీడీపీలో హీరోలుగా ఉన్నారు.. వైసీపీ చెంత జీరోలయ్యారు ?
By: Tupaki Desk | 9 Aug 2021 4:55 AM GMTఏపీలో గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని ఎదుర్కొని టిడిపి నుంచి 23 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇంత తీవ్రమైన వ్యతిరేకత గాలులు వీచినా కూడా ఎదుర్కొని మరీ వీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు అంటే మీరు మామూలు నాయకులు కాదనే చెప్పాలి. పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో వీరు అధికార పార్టీ చెంత చేరితే నాలుగేళ్లపాటు హ్యాపీగా కాలక్షేపం చేయవచ్చు అని సైకిల్ దిగేరు. పార్టీ చరిత్రలోనే ఇంత ఘోరంగా ఓడిపోవడంతో 2024 ఎన్నికల్లో అయినా గెలుస్తుందా ? అన్న సందేహాలు టీడీపీలోనే చాలా మందికి ఉన్నాయి. ఈ క్రమంలోనే వీరు సైకిల్ దిగి చేశారు. వాస్తవంగా టిడిపిలో ఉన్నప్పుడు తమ నియోజకవర్గాల్లో వీరు చెప్పిందే వేదంగా మారింది. అయితే ఇప్పుడు పార్టీ మారిన వెంటనే వీరు వైసీపీలో పూచికపుల్ల మాదిరిగా మారిపోయారు. చివరకు తమ నియోజకవర్గాల్లో తాము చెప్పింది జరగకపోవడంతో తీవ్ర అసహనంతో ఏం చేయాలి ? దేవుడా అని నెత్తి, నోరు కొట్టుకుంటున్న పరిస్థితి.
గత ఎన్నికల్లో టిడిపి నుంచి గన్నవరంలో వల్లభనేని వంశీ - గుంటూరు పశ్చిమంలో మద్దాలి గిరిధర్ రావు - విశాఖ దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ - ప్రకాశం జిల్లా చీరాలలో సీనియర్ నేత కరణం బలరాం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గాల్లో పనులు కాకపోవడంతో వీరంతా జగన్ చెంత చేరిపోయారు. వీరికి ముఖ్యమంత్రి జగన్ సైతం ఒకటి రెండుసార్లు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వీరిని అటు ముఖ్యమంత్రి, ఇటు వైసీపీ కీలక నేతలు... చివరకు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ కేడర్ పట్టించుకోని పరిస్థితి ఉంది.
చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వీరి మాట ఎవ్వరూ వినలేదు. పార్టీ అధిష్టానం సైతం చోద్యం చూస్తుంటే తప్పా ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జ్‌లకు, పార్టీ మారిన ఈ ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య కుదర్చడం లేదు. దీంతో వీరు తమ బాధ ఎవ్వరికి చెప్పుకోలేరు. అలాగని తిరిగి టీడీపీలోకి వెళ్లనూ లేరు. ఏదో పైకి నవ్వుతూ లోపల కుమిలిపోతూ రాజకీయం చేస్తోన్న పరిస్థితి. జనసేనకు దూరం కాకముందు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తాను జనసేనలో నెంబర్ వన్ అని .. అదే వైసీపీలోకి వెళితే నెంబర్ 152 అని అన్నారు. ఇప్పుడు టీడీపీని వీడిన ఈ ఎమ్మెల్యేల లెక్క కూడా వైసీపీలో 153 నుంచి మొదలవుతుందనే సెటైర్లు పేలుతున్నాయి.