Begin typing your search above and press return to search.
వాళ్లు కృష్ణార్జునులు కాదు.. ధుర్యోధనుడు-శకుని !
By: Tupaki Desk | 17 Dec 2019 7:37 AM GMTగత కొన్ని రోజులుగా దేశంలో కొన్ని చోట్ల ..కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ పౌరసత్వ సవరణ బిల్లుకి పార్లమెంట్ లో ఆమోదం తెలిపిన బీజేపీ ..వెను వెంటనే రాష్ట్రపతి కూడా ఆ బిల్లుకి ఆమోదం తెలపడంతో ఆ బిల్లు చట్టంగా మారిపోయింది. దీనితో ఈ చట్టం పై కొందరు భగ్గుమంటున్నారు. కానీ , బీజేపీ నేతలు మాత్రం ప్రధాని మోడీ ని , కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కృష్ణార్జునులుతో పోల్చుతూ వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
కానీ, బీజేపీ వాళ్ళు నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కృష్ణార్జునులుతో పోల్చడాన్ని తమిళ నటుడు సిద్ధార్థ్ ఆక్షేపించాడు. పలు సినిమాలతో తెలుగు వారితో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన సిద్ధార్థ్ వివిధ సామాజిక అంశాల మీద స్పందిస్తూ ఉంటాడు. అలాగే గత కొద్ది రోజులుగా హీరో సిద్దార్ట్ రాజకీయ పరమైన అంశాల పై ట్విటర్ లో స్పందిస్తున్నారు.
ఈ తరుణంలోనే భారతీయ జనతా పార్టీ వాళ్లపై ఈ నటుడు పలుసార్లు ఫైర్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి మోడీ, అమిత్ షాలను తీవ్రంగా విమర్శించాడు. పౌరసత్వ చట్టం వివాదం గురించి సిద్ధార్థ్ స్పందిస్తూ మోడీని ధుర్యోధనుడితో, అమిత్ షాను శకునితో పోల్చాడు. వాళ్లు కృష్ణార్జునులు కాదు, ధుర్యోధనుడు-శకుని అని సిద్ధార్థ్ ఫైర్ అయ్యారు. పౌరసత్వం చట్టం సవరణలను వ్యతిరేకిస్తున్న విద్యార్థులకు సిద్ధూ మద్దతు పలికాడు.