Begin typing your search above and press return to search.

దేశాన్ని లేప‌డానికి వారు ప‌డిపోతున్నారు.. దశాబ్దాలుగా వీధుల్లో నిద్ర‌పోతున్న జ‌పాన్ వాసులు!

By:  Tupaki Desk   |   10 March 2021 1:30 AM GMT
దేశాన్ని లేప‌డానికి వారు ప‌డిపోతున్నారు.. దశాబ్దాలుగా వీధుల్లో నిద్ర‌పోతున్న జ‌పాన్ వాసులు!
X
మ‌న ద‌గ్గ‌ర ఎవ‌రైనా వీధిలో ప‌డుకుంటే జ‌నం ఏమ‌నుకుంటారు..? ఎవ‌రో బెగ్గ‌ర్ అయి ఉంటాడ‌ని అనుకుంటారు. కానీ.. అత‌ను సూటూ బూటు వేసుకొని ప‌డుకుంటే మాత్రం.. ‘ప‌డిపోయాడు’అని డిసైడ్ చేస్తారు. ఫుల్లుగా తాగేసి, ఒళ్లు మ‌రిచిపోయి పడిపోయాడని అనుకుంటారు. అయితే.. జపాన్ లో సాయంత్రం, రాత్రివేళల్లో ఏ వీధిలో చూసినాా పదుల సంఖ్యలో ఇలా పడుకున్నవారు కనిపిస్తారు!

అయితే.. వారు కావాల‌ని ప‌డుకోవ‌ట్లేదు. అల‌సిపోయి, సొల‌సిపోయి.. ఇంటి వ‌ర‌కూ వెళ్ల‌లేక రోడ్డుమీద‌నే నిద్ర‌పోతున్నారు! క‌ష్ట‌మైనా, సుఖ‌మైనా.. ఏదైనా మితంగా ఉంటేనే అన్నివిధాలా మంచిది. క‌ష్టాలు, సుఖాలు ఏది ఎక్కువైనా నాశ‌న‌మ‌య్యేది ఆరోగ్య‌మే! ఇప్పుడు జ‌పాన్ వాసులు మితిమీరిన క‌ష్టంతో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన చిత్ర‌మే పైన క‌నిపిస్తున్న‌ది!

రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో జ‌పాన్ పై రెండు అణుబాంబులు ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో.. ఆ దేశం దారుణ‌మైన ప‌రిస్థితుల్లోకి నెట్ట‌బ‌డింది. క‌నీసం తిన‌డానికి తిండికూడా లేకుండాపోయింది. ఇప్ప‌టికీ.. చాలా ప్రాంతాల్లో గ‌డ్డికూడా మొల‌వ‌ని ప‌రిస్థితి. ఆ విధంగా.. అంతులేని క‌ష్టాల్లో కూరుకుపోయిన జ‌పాన్ ను ఆర్థికంగా నిల‌బెట్టేందుకు అప్ప‌టి ప్ర‌ధాని shigeru yohida దేశంలో ప‌నిగంట‌లు పెంచాల‌ని ప్ర‌తిపాదించారు. ఆ విధంగా మొద‌లైన అధిక ప‌నిగంట‌ల సంప్ర‌దాయం నేటికీ కొన‌సాగుతోంది.

దీంతో.. త‌ర‌త‌రాలుగా ఈ అధిక శ్ర‌మ కొన‌సాగుతుండ‌డంతో యావ‌త్‌ జ‌పాన్ మొత్తం ఇబ్బందుల్లో ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. నిత్యం ప‌నిచేస్తూ అక్క‌డ పిల్ల‌ల‌ను క‌న‌డానికి కూడా యువ‌త‌కు అవ‌కాశం లేకుండా పోతోంద‌ని ప‌లు స‌ర్వేలు చెబుతున్నాయి. పెళ్లిళ్లు కూడా త‌క్కువ‌గానే జ‌రుగుతున్నాయి. వారు వీధుల్లో నిద్ర‌పోతున్న ప‌రిస్థితులు చూస్తుంటే.. ఎంత‌గా అల‌సిపోతున్నారో.. ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతోంది. దీనివ‌ల్ల వారు అనేక గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ఇంకా చాలా రోగాల పాల‌వుతున్నారు.

జ‌పాన్ లో నివ‌సిస్తున్న పోలెండ్ ఫొటో గ్రాఫ‌ర్ పావెల్ అక్క‌డ వీధుల్లో నిద్ర‌పోతున్న ఉద్యోగుల ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌ట్టే ఫొటోల‌ను సేక‌రించాడు. 2008 నుంచి 2010 మ‌ధ్య తీసిన ఫొటోల‌ను 2018లో ఓ పుస్త‌కంలో ప్ర‌చురించారు. ఈ విష‌యాన్ని ఎప్ప‌టి నుంచో చూస్తున్న అక్క‌డి ప్ర‌భుత్వం కూడా.. ప‌ని గంట‌లు త‌గ్గించాల‌ని కార్పొరేట్ కంపెనీల‌కు సూచించింది.

అన్న‌ట్టు.. అక్క‌డ వారానికి 60 ప‌ని గంట‌లు అనేది సాధార‌ణ డ్యూటీ. అంటే రోజుకు ప‌ది గంట‌లు. కానీ.. మెజారిటీ ఉద్యోగులు ఓవర్ టైం చేస్తూనే ఉంటారు. కంపెనీలు చేయిస్తున్నాయో.. వీరే చేస్తున్నారో తెలియ‌దు కానీ.. ఇది కూడా అక్క‌డ స‌ర్వ‌సాధార‌ణం.