Begin typing your search above and press return to search.
విషయం తెలిస్తే షాక్ తినాల్సిందే.. ఏటీఎంలో సరికొత్తగా దోచేస్తున్నారు
By: Tupaki Desk | 30 Aug 2020 8:10 AM GMTఈ దొంగల తెలివి చూస్తే నోట మాట రాదంతే. ఇలా కూడా దోపిడీలకు పాల్పడొచ్చా? అన్న సందేహం కలిగేలా ఉన్న ఈ వ్యవహారం మీరెప్పుడూ వినని రీతిలో ఉంటుందని చెప్పక తప్పదు. ఏటీఎంలలో సరికొత్తగా చోరీ చేస్తున్న వైనం బ్యాంకు అధికారులకే దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చింది. తాజాగా యూపీ.. రాజస్థాన్ కు చెందిన ఒక ముఠాను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరు చేసే మోసం ఎంత హైటెక్ గా ఉంటుందంటే..
ప్రమోద్.. సంతోష్.. అజయ్.. కమల్.. పవన్ అనే ఐదుగురు యూపీ.. రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు. వీరో ముఠాగా ఏర్పడ్డారు. తమకు తెలిసిన వారి డెబిట్ కార్డులు తీసుకుంటారు. ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేస్తారు. ఇక్కడే వీరో చిత్రమైన పని చేస్తారు. అదేమంటే.. డ్రా చేసే సమయంలో బయటకు వచ్చిన డబ్బుల్ని తీసుకోరు. అలా చేయకుంటే కాసేపటికి వెనక్కి వెళ్లిపోతాయి. సరిగ్గా.. వెనక్కి వెళ్లే సమయంలో డబ్బులు లోపలకు వెళ్లకుండా వేళ్లతో అడ్డుకుంటారు. ఏటీఎం తెరపై క్యాష్ డిస్పెన్సర్ ఎర్రర్ అనే మెసేజ్ వస్తుంది.
ఆ వెంటనే డబ్బుల్ని బయటకు లాగేస్తారు. తర్వాత కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తారు. ఏటీఎంలో డబ్బులు రాలేదు.. అకౌంట్లో డబ్బులు విత్ డ్రా అయినట్లు చూపుతోందని ఫిర్యాదు చేస్తారు. చెక్ చేసిన అధికారులు.. వారు డబ్బుల్ని డ్రా చేసిన సమయంలో ఎర్రర్ మెసేజ్ వస్తుందన్న విషయాన్ని గుర్తించి.. ఆ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాలకు జమ చేస్తారు.
అదేసమయంలో ఏటీఎంలో డబ్బు లెక్క తేడా రావటాన్ని గుర్తించారు. ఇలా పలు ఖాతాలకు సంబంధించి ఫిర్యాదులు రావటం.. ఏటీఎంలో డబ్బులు లెక్క తేలకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం సీసీ కెమేరా ఫుటేజ్ చేస్తే.. వారు చేసిన మోసం ఏమిటో అర్థమైంది. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల్ని వెతికి అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహా మోసాలు ఇప్పటివరకు చూడలేదన్న మాట బ్యాంకింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.