Begin typing your search above and press return to search.
కండోమ్ లంటూ మంట పుట్టించాడు
By: Tupaki Desk | 8 Nov 2016 9:21 AM GMTమాటకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. ఒక అంశాన్ని ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించేందుకు కీలకంగా ఉండే మాటను ఆయుధంగా చేసుకొనే నేతలు చాలామందే కనిపిస్తారు. అయితే.. ఇలాంటి వారిలో వివాదాస్పద వ్యాఖ్యలతో కొందరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తే.. మరికొందరు తూటాల్లాంటి మాటలతో ఉలిక్కిపడేలా చేశారు. తాజాగా అలానే వ్యవహరించారు ఢిల్లీ జేఎన్ యూ నేత కన్నయ్య కుమార్. గతంలో అతగాడి వ్యవహారం ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే.
ఇటీవల యూపీలోని బదౌన్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల నజీబ్ కనిపించకుండా పోయారు. అక్టోబరు 15 నుంచి ఆచూకీ లభించని పరిస్థితి. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ విద్యార్థులతో ఘర్షణ కారణంగానే నజీబ్ అదృశ్యమయ్యారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. నజీబ్ అదృశ్యంపై విచారణ జరపాలని.. వెంటనే అతని ఆచూకీ తెలపాల్సిందిగా జేఎన్ యూ క్యాంపస్ లో అతని కుటుంబ సభ్యులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. నజీబ్ అదృశ్యంపై జేఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేఎన్ యూ విశ్వవిద్యాలయంలోని కొందరు విద్యార్థుల తీరును తప్పు పడుతూ.. ఆ మధ్యన బీజేపీ ఎమ్మెల్యే అహుజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని ప్రస్తావించిన కన్నయ్య.. జేఎన్ యూలో రోజూ ఎన్ని కండోమ్ లు వాడుతున్నారో కనుగొనే అధికారులు.. ఆచూకీ లేకుండా పోయిన విద్యార్థిని కనిపెడితే మంచిదని చురకలేశారు.
జేఎన్ యూలో ప్రతిరోజూ మూడు వేల బీర్ బాటిళ్లు.. 2వేల మద్యం సీసాలు.. పదివేల సిగిరెట్ ప్యాకెట్లు.. 4వేల బీడీలు.. 3 వేల వాడి పారేసిన కండోమ్ లు.. అబార్షన్లు అయ్యేందుకు ఉపయోగించే 500 ఇంజెక్షన్లు దొరికినట్లుగా బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇలాంటి లెక్కల్ని మానేసి.. తప్పిపోయిన విద్యార్థి ఆచూకీని తేల్చాల్సిందిగా కన్నయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/