Begin typing your search above and press return to search.
హత్తుకొని సాంత్వన ఇస్తారు.. గంటకు రూ.7వేలు చార్జ్ చేస్తారు.. ఇదేంటసలు?
By: Tupaki Desk | 16 July 2022 1:30 PM GMTశతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని ఊరికే అనలేదు. ఇప్పుడు చెప్పేది మొత్తం చదివాక.. ఈ సామెత మనసులో ఫ్లాష్ లాగా వెలుగక మానదు. అపాయింట్ మెంట్ తీసుకొని మరీ.. పిలిపించుకొని.. దగ్గరగా ఉండి.. ఆత్మీయంగా హత్తుకొని గంట పాటు ఉన్నందుకు..
మనసుకు సాంత్వన కలిగించినందుకు రూ.7వేలు ఛార్జ్ చేసే వ్యక్తి గురించి మీరెప్పుడైనా విన్నారా? మనసుకు ఏ క్షణంలో అయినా ఒంటరిగా ఉన్నామన్న భావన కలిగితే చాలు.. ఫోన్ చేస్తే చాలు.. రెక్కలు కట్టుకొని వాలిపోయే వారు బ్రిటన్ లో పలువురు ఉంటారు. ఇలాంటి సేవల్ని అందించే వారిని కడల్ థెరఫీగా వ్యవహరిస్తారు.
మీరు మిగిలిన వారి మాదిరి కాదు. కాస్తంత స్పెషల్. మనసులో ఒంటరితనంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. దాని నుంచి బయటపడలేని వారికి.. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఈ ప్రొఫెషనల్స్ పని చేస్తుంటారు. భుజాలపై చేయి వేసి దగ్గరకు తీసుకుంటారు. తల నిమురుతూ మనసులో ఆందోళన తగ్గేలా మేజిక్ చేస్తారు. ఇలాంటి సేవల్ని అందించినందుకు ప్రతిగా రూ.7వేలు (మన రూపాయిల్లో) చెల్లించాల్సి ఉంటుంది.
అదేంటి? ఇల్లు అన్నాక కుటుంబ సభ్యులు ఉంటారు కదా? వారితో సాంత్వన పొందొచ్చు కదా? అన్న సందేహాలు రావొచ్చు. మనలాంటి ఫ్యామిలీ సెటప్ లు పశ్చిమ దేశాల్లో ఉండవు కదా? ఒకవేళ ఉన్నా.. ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి వారు వారి.. ప్రైవసీ జోన్లలో బతికేస్తున్న పరిస్థితి. ఇలాంటివారు.. తమకు అవసరమైన సేవల్ని డబ్బులు పెట్టేసి కొనేసుకొని.. ప్రొఫెషనల్ గా సర్వీసు తీసుకుంటుంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి సేవలకు డిమాండ్ పెరిగింది.
మనిషికి మనిషికి మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ.. ఇలాంటి సేవల అవసరం అంతే ఎక్కువ అవుతుంది కదా. ఈ సేవల్ని పొందే వారికి దగ్గరగా వచ్చి కౌగిలించుకోవటమేకాదు.. అంతకు మించిన చాలానే చేయాల్సి ఉంటుందట. వారు కోరుకున్న స్నేహాన్ని.. తోడును.. తాము ఉన్నామన్న భావనను కల్పించేలా చేయాల్సి ఉంటుంది. మానసిక సంతోషం ఇక్కడ చాలా ముఖ్యం.
అంతేకాదు.. ఈ థెరపీ కోరుకునే వారికి.. ముందుగా వారి గురించి తెలుసుకోవటంతో పాటు.. ఈ థెరపీ తీసుకునే సమయంలో వారు ఎలాంటి రూల్స్ పాటించాలన్న విషయానికి సంబంధించిన వివరాల్ని కూడా ఈ థెరఫిస్టులు వివరిస్తూ ఉంటారు. ఇలాంటి సెషన్ లు తీసుకునే సమయంలో.. కొందరికి లైంగిక పరమైన ఆలోచనలు కూడా వస్తుంటాయని.. అలాంటి సమయాల్లో థెరపీని మధ్యలో ఆపి.. తర్వాతి రోజుకు వాయిదా వేసి.. కంటిన్యూ చేస్తారని చెబుతుంటారు. చూస్తుంటే.. దీనంతటి కష్టమైన.. క్లిష్టమైన సేవ మరొకటి ఉండదేమో కదా?