Begin typing your search above and press return to search.

స్వోత్క‌ర్ష‌.. ప‌ర‌నింద‌ల ప్లీన‌రీ.. దిశానిర్దేశం ఏదీ?

By:  Tupaki Desk   |   8 July 2022 10:30 AM GMT
స్వోత్క‌ర్ష‌.. ప‌ర‌నింద‌ల ప్లీన‌రీ.. దిశానిర్దేశం ఏదీ?
X
వైసీపీ ప్లీన‌రీ ప్రారంభ‌మైంది. వ‌చ్చే రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. అనేకమంది నాయ‌కులు ఈ ప్లీన‌రీపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఎన్నో ఆశ‌ల‌తో ఎదురు చూశారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పాల‌న‌పై ప్ర‌జ‌ల నుంచి పెద‌వి విరుపులు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో వ‌చ్చే రెండేళ్ల‌లో పెట్టుకునే ల‌క్ష్యాలు.. ప్ర‌జ‌ల‌ను చేరుకునే అంశాలు.. గెలుపు మంత్రాలు.. ప్ర‌జాతంత్రాల‌ను.. జ‌గ‌న్ వెల్ల‌డిస్తార‌ని.. త‌మ‌కు ఊర‌ట క‌ల్పిస్తార‌ని అనుకున్నారు. అయితే.. అలా జ‌ర‌గ‌లేదు.

మూడేళ్ల పాల‌న‌లోసంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామ‌ని.. 13 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని.. జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. త‌మ మేనిఫెస్టోను భ‌గ‌వ‌ద్గీత‌గా, ఖురాన్‌గా, బైబిల్‌గా చెప్పుకొచ్చారు.

అయితే.. వాస్త‌వానికి ఈమూడేళ్ల పాల‌న‌లో ఏపీ అభివృద్ధి మూల‌న‌ప‌డింది. రాజ‌ధాని లేదు. రోడ్లులేవు.. పిల్ల‌ల‌కు ఉద్యోగాలు లేవు. ఉన్న‌త చ‌దువుల‌కు సాయం లేదు. సంక్షేమం కొంద‌రికే ప‌రిమితం అయింది.

ధ‌ర‌లు పెరిగిపోయి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిస‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కూడా ల‌భించ‌డం లేదు. ఈ విష‌యాలే.. వైసీపీ నాయ‌కులు నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో తేట‌తెల్లం అవుతున్నాయి. దీనికి సంబందించి ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే సీఎం కు అనేక విన్న‌పాలు చేశారు. ఈ క్ర‌మంలో ప్లీన‌రీ వేదికగా ప్ర‌జ‌ల సమ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తార‌ని.. వ‌చ్చే రెండేళ్ల‌లో చేయాల‌ని అనుకున్న కార్య‌క్ర‌మాల‌ను చెబుతార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా విజ‌యం ద‌క్కించుకోవాలో దిశానిర్దేశం చేస్తార‌ని అనుకున్నారు.

మ‌రీ ముఖ్యంగా తాను వ‌చ్చే రెండేళ్ల‌లో రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తానో చెబుతార‌ని.. నాయ‌కులు ఆశించారు. మ‌రో వైపు ప్ర‌జ‌లు కూడా సీఎం జ‌గ‌న్ నుంచి చాలానే ఎక్స్పెక్ట్ చేశారు. అయితే..స్వోత్క‌ర్ష ప‌ర‌నింద‌ల‌కే.. ప్లీన‌రీ ప‌రిమితం అయిపోయింది.

టీడీపీపై విమ‌ర్శ‌ల‌కే జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు. అదేస‌మ‌యంలో గ‌తం తాలూకు అనుభ‌వాల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ పాడిందే పాట అన్న‌ట్టుగా చెప్పుకొచ్చారు త‌ప్ప‌.. రాష్ట్రానికి దిశ‌, ద‌శ ఏర్పాటు చేసేందుకు ఆయ‌న చెప్పిన మాట‌ల్లో ఒక్క విష‌యం కూడా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్లీన‌రీ అంతా.. తుస్సేన‌ని.. వ‌చ్చి.. తిని వెళ్లామ‌ని అంటున్నారు నాయ‌కులు.