Begin typing your search above and press return to search.
బ్రేక్ ఫాస్ట్ నుంచి బెడ్రూంకు వెళ్లారు: హసీన్ జహా
By: Tupaki Desk | 21 March 2018 1:06 PM GMTటీమిండియా పేసర్ షమికి అలీష్బా అనే పాకిస్థాన్ అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని, వారిద్దరూ దుబాయ్ లో కలిశారని అతడి భార్య హసీన్ జహా షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాను కేవలం షమి అభిమానిగా మాత్రమే అతడిని కలిశానని, అంతకుమించి తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని అలీష్బా తెలిపింది. ఈ నేపథ్యంలో వారిద్దరిపై జహా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. దుబాయ్ లో తన భర్తతో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ అలీష్బా మొదలు పెట్టిన సంభాషణ ఆ రోజు రాత్రి బెడ్రూంలో ముగిసిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. అలీష్బా షమి అభిమాని కాదని.... ప్రేయసి లేదా వ్యభిచారి అయి ఉండాలని జహా మండిపడింది. అంతేకాకుండా, షమి.... ఇంకెంతమంది అమ్మాయిలను మోసం చేస్తాడని...అతడికి బుద్ధి వచ్చేలా నడిరోడ్డుపై నిలబెట్టి కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. అందుకు మీడియా మిత్రులు కూడా సాయం చేయాలని జహా కోరింది.
అయినా, తన కుటుంబ సభ్యులకు తెలియకుండా ఒక అమ్మాయి .....మగాణ్ని రహస్యంగా కలుస్తోందంటే అర్థమేంటని అలీష్బాను ఉద్దేశించి జహా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. తన వైవాహిక జీవితాన్ని ఆమె నాశనం చేసిందని ఆరోపించింది. షమితో అలీష్బాకు సంబంధముందని చాలా సార్లు చెప్పానని, దుబాయ్ లో వారిద్దరూ కలిసేందుకు జనవరిలోనే ప్లాన్ చేసుకున్నారని తెలిపలింది. ఈ నెల 23న పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలవబోతున్నానని, ఈ వ్యవహారం మొత్తాన్ని సీఎంకు స్వయంగా తెలియజేస్తానని చెప్పింది. తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని - షమిని - అతడి కుటుంబసభ్యులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని జహా డిమాండ్ చేసింది. మరోవైపు, షమి...జహా ఆరోపిస్తున్న తేదీల్లో దుబాయ్ లో ఉన్నట్లు బీసీసీఐ ధృవీకరించింది.