Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ భార్య అందుకే విడాకులు తీసుకుందా?

By:  Tupaki Desk   |   16 Nov 2015 4:14 AM GMT
ఇమ్రాన్ భార్య అందుకే విడాకులు తీసుకుందా?
X
మాజీ పాక్ క్రికెటర్ దిగ్గజం.. తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత అంశాలతో తాజాగా వార్తల్లోకి వచ్చింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత.. ప్రేమించి పళ్లాడిన అంతర్జాతీయ జర్నలిస్ట్ రెహంఖాన్ తో పది నెలల కాపురం తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి బంధం మీద చాలానే మాటలు వినిపించాయి.

ఇమ్రాన్ రాజకీయ పార్టీలో రెహంఖాన్ పెత్తనం చెలాయించాలని చూసినందుకే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని కొందరు.. ఇమ్రాన్ ను విషప్రయోగంతో చంపేయాలని చూసినందుకే వారు విడిపోయారంటూ మరికొందరు ఆరోపణలు చేశారు. వీటిల్లో నిజానిజాల సంగతి ఏమిటన్నది వీరిద్దరూ పెదవి విప్పింది లేదు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ రెండో భార్య రెహం ఖాన్ మాట్లాడింది. తమ విడాకులకు దారి తీసిన పరిస్థితుల గురించి వివరించింది. పెళ్లి పెటాకులైన రెండు వారాల తర్వాత పెదవి విప్పిన రెహంఖాన్ ఇమ్రాన్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా కొన్ని వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

వంటింట్లో కూర్చొని చపాతీలు చేసుకోవాలని.. బయట కనిపించకూడదంటూ ఇమ్రాన్ ఆంక్షలు విధించారని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకొని ఇమ్రాన్ ఇంటికి వచ్చిన నాటి నుంచి తనపై ఒత్తిడి పెరిగిందని చెప్పింది. మరి.. తాజాగా విడాకులు పొందిన మాజీ భార్య చేసిన ఆరోపణలపై ఇమ్రాన్ ఏం బదులిస్తారో..?