Begin typing your search above and press return to search.
వైరల్: పుచ్చకాయ హెల్మెట్లతో చోరీ
By: Tupaki Desk | 22 May 2020 1:30 AM GMTశతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. ప్రస్తుతం అంతటా విస్తరించి ఉన్న సీసీ టీవీల నుంచి తప్పించుకోవడం.. వాటికి కనపడకుండా దాక్కోవడం అసాధ్యమే. అందుకే దొంగలు కూడా తెలివి మీరిపోయారు. ఈ మహమ్మారి విస్తరిస్తున్న టైంలో కొత్తగా ఆలోచించారు. లాక్ డౌన్ కారణంగా మూసివున్న స్టోర్ లోకి వినూత్నంగా వెళ్లి తమకు కావాల్సిన ఆహారం సహా అవసరాలను చోరీ చేశారు..
తాజాగా అమెరికాలోని వర్జీనియాలో ఇద్దరు యువకులు తలకు పుచ్చకాయలను ధరించి మూసివున్న స్టోర్ లోకి ప్రవేశించారు. అనంతరం అక్కడి వస్తువులను దొంగిలించి చల్లగా జారుకున్నారు. ఈ దొంగల పుచ్చకాయ ఐడియాకు పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇలా కూడా దొరకకుండా దొంగతనాలు చేయొచ్చా అని అబ్బురపడ్డారు. దీంతో వీరి ఫొటోలను లూయిసా పోలీసులు ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
పుచ్చకాయల లోపల ఉండే గుజ్జును మొత్తాన్ని తొలగించి ఆ డొప్పలను తలకు పెట్టుకొని స్టోర్లోకి ప్రవేశించి దొంగతనం చేశారు ఇద్దరు దొంగలు. కళ్లు కనపడేందుకు వీలుగా పుచ్చకాయలకు కళ్ల వద్ద రెండు కన్నాలు పెట్టుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ పుచ్చకాయ హెల్మెట్ దొంగల ఫొటోలను చూసి అందరూ జోకులు పేలుస్తున్నారు. మాస్క్ ల కంటే ఈ పుచ్చకాయ హెల్మెట్లు బెటర్ అంటూ కొనియాడుతున్నారు. ఇలాంటి విపత్కర కాలంలో ఇలాంటి కంత్రీ ఐడియాలతో దొంగలు పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు.