Begin typing your search above and press return to search.
అప్ డేట్ అయ్యారు.. ఏటీఎంను లేపేశారు
By: Tupaki Desk | 22 Aug 2017 4:37 AM GMTఏటీఎం దొంగతనాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు తమ మొహాలు కనిపించకుండా పూర్తిగా కప్పేసుకుని ఏటీఎం మెషిన్ ను పగలకొట్టడం అందులో డబ్బు తీసుకుపోవడం చేస్తుంటారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి.. ఏటీఎం మెషిన్ నే ఎత్తుకు పోయి.. పోలీసులకు దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఇలాంటిదే.. కానీ ఇంకొంచెం వెరైటీగా ఏటీఎంను ఎత్తుకెళ్లిపోయారు. లోపలికి వెళ్లడం.. మెషిన్ ను తీసుకురావడం.. సీసీ కెమెరాలో పడటం ఇవన్నీ ఎందుకులే అనుకున్నారో ఏమో.. ఏకంగా ఒక ట్రక్కుతో ఏటీఎం మెషిన్ ను పెకిలించి ఎత్తుకెళ్లి పోయారు!! దొంగలకే దొంగల్లా ఉన్న వీరి కోసం అమెరికా పోలీసులు గాలిస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా.. అందులోనూ కొన్ని లోపాలు ఉంటూనే ఉంటాయి. వీటన్నింటినీ వెతికి పట్టుకుని.. దొంగలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. ఎక్కడ ఏ చిన్న దొంగతనం జరిగినా.. టెక్నాలజీతో పట్టేసుకుంటామని పోలీసులు చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఒక దొంగల బ్యాచ్ వీరికి అతిపెద్ద సవాలు విసిరింది. ఆగస్టు 16న జరిగిన ఈ దొంగతనం వీడియోను అమెరికాలోని కాన్వే పోలీసులు రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఓ పెద్ద ట్రక్కుతో ఏటీఎం సెంటర్ ను పగలకొట్టుకుంటూ వెళ్లిన నిందితులు మిషన్ తో సహా ఊడపీకేశారు.
ఆపై దానిని అదే వాహనానికి ఉన్న ఉన్న క్రేన్ సాయంతో ఎత్తుకెళ్లిపోయారు. ఉదయం డ్యూటీకి వచ్చిన బ్యాంకు సిబ్బంది అక్కడ జరిగిన బీభత్సాన్ని చూసి అవాక్కయ్యారట. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. చోరికి గురైన మెషీన్ లో ఎంత డబ్బు ఉన్నదన్న విషయంపై బ్యాంకు అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. అయితే వచ్చిన వారెవరో తెలీదు. ఎలా ఉంటారో అస్సలు తెలీదు. తెలిసింది ఒక్కటే.. ట్రక్కు! మరి ఈ కేసు ఛేదించడం నిజంగా అమెరికా పోలీసులకు సవాల్ లాంటిదే!!