Begin typing your search above and press return to search.
కదులుతున్న రైలుకు కన్నమేసి కోట్లు కొట్టేశారు
By: Tupaki Desk | 9 Aug 2016 5:29 PM GMTదాదాపుగా 20 ఏళ్లకు పైనే తమిళంలో తిరుడా.. తిరుడా అనే ఒక సినిమా విడుదలైంది. అది తెలుగులో దొంగ.. దొంగగా విడుదలైంది. ఆ సినిమాలో దొంగల్ని చూస్తే.. ఓర్నీ ఎంత వీజీగా కన్నాలేస్తున్నారో అనిపించక మానదు. రీల్ లైఫ్ లో కనిపించినంత ఈజీగా రియల్ లైఫ్ లో సాధ్యం కాదన్నట్లుగా ఆ సినిమాలో సన్నివేశాలు ఉంటాయి. కానీ.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించిన వివరాలు వింటే.. ఆ సినిమాలో సీన్లు టుమ్రీలుగా తేలిపోతాయి.
సంచలనంగా మారిన తాజా రైలు దోపిడీ వింటేనే ఉలిక్కిపడిపోయే పరిస్థితి. తమిళనాడు రాష్ట్రంలోని సేలంలోని జాతీయ బ్యాంకు నుంచి సుమారు రూ.342 కోట్ల మొత్తాన్ని 226 బాక్సుల్లో సర్ది చెన్నైలోని రిజర్వు బ్యాంకుకు పంపారు. భారీ భద్రత మధ్య ఈ ఎక్స్ ప్రెస్ రైలును తరలించారు. అనుకున్నట్లే చెన్నైకి చేరుకున్న ఈ ట్రైన్ లోని క్యాష్ బాక్సుల్ని ఓపెన్ చేస్తే కరెంటు షాక్ తగిలినంత పనైంది. ఎందుకంటే.. ట్రైన్ పై కప్పు బాగంలో వెల్డింగ్ పరికరాలతో రంధ్రంచేసి ట్రైన్ లోకిప్రవేశించి 6 కోట్లో వరకు డబ్బు కొట్టేసినట్లుగా భావిస్తున్నారు.
రైలు కదులుతున్న వేళనే ఇంత భారీగా చోరీ జరగటం అటు బ్యాంకు వర్గాలు.. ఇటు రైల్వే.. భద్రతా వర్గాల నోటి వెంట మాట రాని పరిస్థితి. డీజిల్ ఇంజిన్ కారణంగా.. దొంగలకు అనువుగా మారి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చోరీకి గురైన మొత్తం ఎంతన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సినిమాటిక్ గా జరిగిన ఈ చోరీ ఎలా జరిగింది? దీనికి బాధ్యులు ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు అధికారులు తలమునకలయ్యారు.