Begin typing your search above and press return to search.

కరోనా సమయంలో కూడా రెచ్చిపోతున్న దొంగలు

By:  Tupaki Desk   |   16 July 2020 1:30 PM IST
కరోనా సమయంలో కూడా  రెచ్చిపోతున్న దొంగలు
X
దేశంలో కరోనా మహమ్మారి విలయంతాండవం చేస్తుంది. ప్రతిరోజూ కూడా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు 20 వేల లోపు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ..తాజాగా 30 వేలు దాటింది. దీనితో దేశ వ్యాప్తంగా అలజడి పెరుగుతుంది. అలాగే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య పది లక్షలకి చేరువలో ఉంది. దీనితో ప్రభుత్వ వర్గాల్లో కూడా ఆందోళన మొదలైంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 32,695 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 606 మంది కరోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోను కరోనా వైరస్ విజృంభణ పెరిగిపోతుంది. గత కొన్ని రోజులుగా నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రికార్డ్ స్థాయిలో 2,432 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 452 మంది మృతి చెందారు.

ఇలా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంటే ..మరోవైపు దొంగలు ఇదే మాకు మంచి తరుణం అని భావించి యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కరోనా సోకుతుందేమో అన్న భయం కూడా లేకుండా దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఇటీవల పాజిటివ్‌ తో మరణించిన వ్యక్తి ఇంట్లో దుండగులు దొంగతనం చేసారు. దాదాపు రూ.6లక్షలు నగదు, 16 కాసులు బంగారం, 10 కిలోలు వెండిని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. క్వారంటైన్ సెంటర్ నుండి ఇంటికి వచ్చి ఇంట్లో జరిగిన చోరీని గుర్తించిన మృతుడి భార్య... పోలీసులకు పిర్యాదు చేసింది.ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.