Begin typing your search above and press return to search.

తొందరగా అలసిపోతున్నారా? అయితే ఇలా చేయాల్సిందే?

By:  Tupaki Desk   |   13 Jan 2023 11:30 PM GMT
తొందరగా అలసిపోతున్నారా? అయితే ఇలా చేయాల్సిందే?
X
రోజంతా కంప్యూటర్ ముందు లేద ఇతర పనులు చేసేవారు కొందరు తొందరగా అలసిపోతారు. చాలా నిద్ర కమ్ముకు వస్తుంటుంది. నీరసంగా ఉంటారు. అందుకు కారణం వారు శరీరానికి సరైన పోషకాహారాన్ని తీసుకోకపోవడమేనని అంటున్నారు. శరీరానికి శక్తిని అందించేందుకు అలసటను అధిగమించేందుకు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయం ఏమీ తినకపోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి అందదు. శక్తి లేకపోవడం వల్ల చురుకుగా పనిచేయలేకపోతారు. త్వరగా అలసిపోవడం, నీరసంగా ఉండటం జరు గుతుంది. పనిచేసేందుకు కావలసిన శక్తి లభించకపోవడంతో, బలవంతంగా పనులు చేయడంతో అనారోగ్యం, నిస్త్రాణ ఏర్పడుతుంది.

తీరకలేని పనివల్ల అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం. ప్రొటీన్లు పుష్కలంగా లభించే గుడ్లును రోజూ తీసుకుంటే అలసట దూరమవుతుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి తోడ్పడతాయి. అంగ స్తంభనలోపం బారిన పడుకుండా కాపాడే ఆమైన్ ఆమ్లాలు గుడ్లు ద్వారా లభిస్తాయి.

లండన్ పరిశోధకులు తేల్చిన పరిశోధన ప్రకారం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినని వారికి భవిష్యత్తులో రోగాల బెడద తప్పదని స్పష్టం చేశారు. ఎసీడీటీ, మధుమేహం, శక్తీ హీనత, బరువు పెరగడం, మెదడు మొద్దుబారిపోవడం, చివరకు గుండెజబ్బులు వస్తాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటికైనా అందరూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం మరిచిపోవద్దు..

ఉదయం అల్పాహారాన్ని తీసుకుని పనిచేసుకోవడం వల్ల అలసట, నీరసం ఏర్పడవు. అతిగా ఆకలి ఏర్పడదు. మధ్యాహ్నాపు భోజనం మితంగానే తీసుకుంటారు. ఉదయం అల్పాహారం తీసుకోనివారు భోజనాన్ని అతిగా తీసుకుని, ఆపసోపాలు పడుతూ నిద్రపోతారు. ఆకారణంగా స్థూల కాయం ఏర్పడుతుంది. ఉదయం అల్పాహారం స్వల్పంగా తీసుకుని, పనిచేసు కునే వారు ఆరోగ్యంగా ఉండటమేకాక, మెదడు, శరీరం చురుకుగా ఉం డటం వల్ల, తమ విధులను చక్కగా నిర్వర్తించగలుగుతారు..

ఉదయం పనులు ఉత్సాహంగా, చురుకుగా చేయటానికి శరీరానికి శక్తి అందేలా పోషక విలువలు లభించే అల్పాహారాన్ని తీసుకోవాలి. గోధుమతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల తగినంత శక్తి లభించడమే కాక అందులో పీచు పదార్థం జీర్ణక్రియకు దోహదపడుతుంది. ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ, దోసె, ఉప్మా, పెస రట్టు లాంటివి కూడా తీసు కోవచ్చు. నూనెతో తయా రు చేసిన టిఫిన్లను ఉదయపు అల్పాహారంగా ఆర గించకూడదు. పాలు, పండ్లు, పండ్ల రసాలు, బ్రెడ్‌, తాజాగా తయారు చేసిన అతిగా నూనె వాడని పదార్థాల ద్వారా పోషకపదార్థాలు, విటమినులు లభించి, శరీరానికి నూతన శక్తి లభిస్తుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.