Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ గురించి మీకు తెలియని ఈ విషయాలు

By:  Tupaki Desk   |   5 Nov 2021 4:27 PM GMT
విరాట్ కోహ్లీ గురించి మీకు తెలియని ఈ విషయాలు
X
విరాట్ కోహ్లీ అంటే ఒక ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడు మాత్రమే కాదు.. అతడో ముందుచూపు ఉన్న వ్యక్తి.. సంపాదనను మంచిగా ఇన్వెస్ట్ చేసి భవిష్యత్తును బంగారం చేసుకున్న పెట్టుబడిదారు కూడా.. కోహ్లీకి ఉన్న క్రేజ్ తో ప్రకటనల ద్వారా అతడికి బోలెడు ఆదాయం వచ్చింది. ఆ ఆదాయంతో పలు రకాల స్టార్టప్ లలో డబ్బులు పెట్టుబడి పెట్టాడు.

ప్రపంచంలో మేటి ఆటగాళ్లలో ఒకరిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ చాలా స్టార్టప్ లలో డబ్బులు పెట్టుబడిగా పెట్టాడు. మొబైల్ గేమింగ్, ఫ్యాషన్ వేర్ నుంచి ఫిన్ టెక్ వరకు పలు రకాల స్టార్టప్ లలో కోహ్లీ పెట్టుబడి పెట్టారు. ఈయన తన 25 ఏళ్ల వయసు నుంచే ఇన్వెస్ట్ మెంట్ చేయడం ప్రారంభించాడు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సోషల్ మీడియా స్టార్టప్ ‘స్పోర్ట్స్ కొన్వో’లో వాటాలు కొనుగోలు చేశారు.

2019 ఫిబ్రవరిలో కూడా కోహ్లీ గాలాక్టస్ ఫన్ వేర్ టెక్నాలజీ సంస్థలో పెట్టుబడి పెట్టాడు. ఇది బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇవే కాదు..యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్, కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ ఎల్ఎల్.పీ వంటి వాటిల్లో కూడా ఈయనకు వాటాలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ ఇంకా డిజిట్ ఇన్సూరెన్స్ లోనూ ఇన్వెస్ట్ చేశారు. అలాగే న్యూవా బ్రాండ్ తో రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగాడు. హైపరైజ్ అనే సంస్థలో కూడా డబ్బులు పెట్టాడు. ఇంకా ఫిట్ నెస్ బ్రాండ్ చిసెల్ ఫిట్ నెస్ లో కూడా  కోహ్లీకి వాటాలు ఉన్నాయి.