Begin typing your search above and press return to search.
మూడో వంతు మాంద్యంలోకి ప్రపంచం.. ఐఎంఎఫ్ సంచలన ప్రకటన
By: Tupaki Desk | 2 Jan 2023 2:43 PM GMTప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు ఈ ఏడాది మాంద్యంలో వెళుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్ ) చీఫ్ ప్రపంచానికి ఒక హెచ్చరిక చేశారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ మరియు చైనా 2023 గత సంవత్సరం కంటే ఒడిదుడుకలకు లోను అవుతాయని హెచ్చరించారు. వాటి ఆర్థిక వ్యవస్థలు మందగిస్తాయని తెలిపారు.
ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా ఆదివారం ఈ ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ 10 నెలలకు పైగా తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించని సమయంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మరియు ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా చైనాలో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల కూడా ప్రపంచ మాంద్యానికి దారితీస్తున్నాయని హెచ్చరించారు.
"ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు మాంద్యంలోకి వెళ్లడం ఖాయమని " అని క్రిస్టాలినా జార్జివా తెలిపారు. 2023 సంవత్సరం గత సంవత్సరం కంటే దారుణంగా తయారవుతోందని.. ఎందుకంటే యుఎస్, ఇయు మరియు చైనా ఆర్థిక వ్యవస్థలు మందగిస్తాయని ఆమె తెలిపారు. "మాంద్యం లేని దేశాలలో కూడా, ఇది వందల మిలియన్ల మందికి మాంద్యం లాగా అనిపిస్తుంది" అని ఆమె వివరించారు.
గత ఏడాది అక్టోబర్‌లో ఐఎంఎఫ్ 2023 కోసం దాని వృద్ధి అంచనాను తగ్గించింది. "ప్రపంచ వృద్ధి 2021లో 6 శాతం నుండి 2022లో 3.2 శాతానికి , 2023లో 2.7 శాతానికి తగ్గుతుందని అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం , కోవిడ్19 మహమ్మారి యొక్క తీవ్రమైన దశ మినహా 2001 నుండి ఇది బలహీనమైన వృద్ధిగా ఐఎంఎఫ్ పేర్కొంటోంది.
దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల తరంగాల నేపథ్యంలో చైనా తన జీరో కోవిడ్ విధానాన్ని రద్దు చేసింది. దాని ఆర్థిక వ్యవస్థను తెరిచింది. "రాబోయే రెండు నెలలు. ఇది చైనాకు కఠినంగా ఉంటుంది. చైనా వృద్ధిపై ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఈ ప్రాంతంపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఐఎంఎఫ్ చీఫ్ హెచ్చరికలు పంపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.