Begin typing your search above and press return to search.
యాత్రల రాజకీయం యూపీకే చెల్లుతుందేమో..?
By: Tupaki Desk | 13 Jan 2016 5:18 AM GMTవివిధ రాష్ట్రాలు పలు సంక్షేమ కార్యక్రమాల్నిచేపడుతుంటాయి. కొన్ని రాష్ట్రాలు అనుసరించే విధానాలు ఆసక్తికరంగానే కాదు.. వెనువెంటనే అమలు చేయాలన్న రీతిలో ఉంటాయి. దివంగత మహానేత వైఎస్ హయాంలో షురూ అయిన 108 వ్యవహారమే తీసుకుంటే.. ఈ విధానం తర్వాతి రోజుల్లో వివిధ రాష్ట్రాలు అమలు చేశాయి. ఇలా సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఒక్కో రాష్ట్ర సర్కారు తీరు ఒక్కోలా ఉంటుంది.
కానీ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న ఒక పథకం భలే ఆసక్తికరంగా ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలకు భిన్నంగా.. ఆ రాష్ట్రానికి చెందిన వృద్ధులను పుణ్యక్షేత్రాలకు పంపే.. ‘‘సమాజ్ వాదీ శ్రావణ యాత్ర’’కు బారీ ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని పలు పుణ్యక్షేత్రాలకు ఎంపిక చేసిన వృద్ధులను ప్రభుత్వం పంపటం.. వారి సౌకర్యాలన్నింటిని చూసుకోవటం ఈ పథకంలో కీలకాంశం. ఇప్పటివరకూ రెండు సార్లు ఇలాంటి యాత్రల్ని నిర్వహించిన అఖిలేష్ యాదవ్ సర్కారు.. ముచ్చటగా మూడోసారి.. ఏపీ.. తమిళనాడు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్ని ఎంపిక చేసింది.
ఇప్పటికే ఉత్తరాఖండ్ లోని రిషీకేశ్.. హరిద్వార్ ఒకసారి.. మరోసారి రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ షరీఫ్.. పుష్కర్ లకు పంపిన వారు.. తాజాగా ఏపీలోని తిరుపతి.. తమిళనాడులోని రామేశ్వరానికి భక్తుల్ని పంపేందుకు డిసైడ్ అయ్యింది. ఇందుకోసం వెయ్యి మందిని ఎంపిక చేశారు. వారిని ప్రత్యేకంగా ఒక రైలులో తరలిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. జనవరి 20న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాన్ని లక్నోలో స్టార్ట్ అయ్యే ఈ ప్రయాణం జనవరి 28 వరకు సాగనుంది. వయసు మళ్లిన వారిని నిర్లక్ష్యం చేయకుండా.. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు ఉచితంగా పంపిస్తూ.. గౌరవ మర్యాదల విషయంలో ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుతూ వారి మనసు దోచుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమం ఉత్తరప్రదేశ్ సర్కారుకే చెల్లుతుందేమో. ఇంతకీ ఈ పథకం గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసా?