Begin typing your search above and press return to search.
పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం.. వ్యాక్సినేషన్ కోసం దూకుడు పెంచిన దేశాలు!
By: Tupaki Desk | 15 May 2021 6:00 AM ISTకరోనా మహమ్మారి రెండో దశలో కోరలు చాస్తోంది. సెకండ్ ప్రభావం యువతపై తీవ్రంగా ఉంది. తొలి దశలో వృద్ధులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది. థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువ ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను పిల్లలపై ప్రయోగాలు జరుపుతున్నారు. ఇప్పటికే పలు టీకాలు చిన్నారులపై ప్రయోగాలు జరిపాయి. కొన్ని దేశాల్లో వివిధ వయస్సుల సమూహాలకు టీకా ఇస్తున్నారు.
ప్రపంచంలో ఇప్పటివరకు 8 టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ 15 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సిన్లు. పిల్లలకు ఇచ్చేందుకు ఇంకా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు, దిగ్గజ సంస్థలు తయారు చేస్తున్నాయి. 2 నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం ఇవ్వడానికి భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం డీసీజీఐ అనుమతులు తాజాగా లభించాయి. దిల్లీ ఎయిమ్స్, పాట్నా ఎయిమ్స్, నాగపూర్ మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ల్లో ఈ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి.
మోడెర్నా టీకా 12 నుంచి 17 ఏళ్ల వారిపై నిర్వహించిన పరిశోధనల ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 6 నుంచి 11 ఏళ్ల వారికోసం మరో టీకాను అభివృద్ధి చేస్తోంది ఆ సంస్థ. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు జూలై అనంతరం రానున్నాయి. అమెరికా రూపొందించిన ఫైజర్-బయోఎంటెక్ సంస్థ చిన్నారుల కోసం వ్యాక్సిన్ రూపొందించిన టీకాకు అమెరికా, కెనడాల్లో అనుమతులు లభించాయి. 6 నెలల నుంచి 2 ఏళ్ల పిల్లల కోసం త్వరలో ప్రయోగాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అస్ట్రాజెనికా టీకాను ఆరు నెలలు పైబడిన పిల్లలకు ఇచ్చే దిశగా ప్రయోగాలు జరుపుతోంది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 12 ఏళ్ల నుంచి 17 ఏళ్ల పిల్లలపై ప్రయోగాల కోసం నోవావాక్స్ 3 వేల మంది టీనేజర్లపై ప్రయోగాలు నిర్వహించింది. ఈ విధంగా వివధ టీకాలు పిల్లలపై ప్రయోగాలు వేగవంతం చేశాయి. మూడో దశలో చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపనుందనే వార్తల నేపథ్యంలో సంస్థలు అప్రమత్తమయ్యాయి. వివిధ దేశాలు ఆ దిశగా దూకుడు పెంచాయి.