Begin typing your search above and press return to search.

మూడో ముప్పు గంట మోగింది.. తీవ్రత గురించి తెలిస్తే చెమటలు పట్టాల్సిందే

By:  Tupaki Desk   |   24 Aug 2021 3:16 AM GMT
మూడో ముప్పు గంట మోగింది.. తీవ్రత గురించి తెలిస్తే చెమటలు పట్టాల్సిందే
X
అమెరికాలో మూడో వేవ్ మొదలైన విషయం తెలిసిందే. ఆ మాటకు వస్తే.. ప్రపంచంలోని పలు దేశాలు మూడో వేవ్ కు కిందామీదా పడుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు ఈ మధ్యన చూస్తున్నాం. గతంతో పోలిస్తే.. మూడోవేవ్ వార్తలకు ఎక్కువ స్పేస్ ఇవ్వట్లేదు మీడియా సంస్థలు. ఇలాంటి వేళ.. మూడో వేవ్ తీవ్రత మనకుండదన్న ధీమా వదిలిపోయి.. వణుకు పుట్టేలా కీలక వ్యాఖ్యలు చేసింది నీతి అయోగ్.. ఎన్ఐడీఎం (జాతీయ ప్రక్రతి వైపరీత్య నిర్వహణ సంస్థ) మూడో వేవ్ గంటను మోగించటమే కాదు.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పిన వైనం చూస్తే చెమటలు పట్టాల్సిందే.

ఇంతకీ ఈ రెండు సంస్థలు దేశంలో మూడో వేవ్ మీద ఒక నివేదికను తయారు చేసింది. దాన్ని తాజాగా కేంద్రానికిఇచ్చింది. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే వణుకు పుట్టాల్సిందే. దేశంలో మూడో వేవ్ తథ్యమని.. సెప్టెంబరు - అక్టోబరు రెండునెలలు అత్యంత కీలకమని పేర్కొంది. సెప్టెంబరులోనే రోజుకు ఐదు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని.. ఇందుకోసం దాదాపు రెండు లక్షల ఐసీయూ పడకల్ని సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ఆగస్టులోనే రోజుకు నాలుగైదు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని లెక్క కట్టింది.

మూడో వేవ్ లో భారత్ కు రానున్న రెండు నెలలు కీలకం కానున్నట్లు జాతీయ ప్రక్రతి వైపరీత్య నిర్వహణ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. వైరస్ లో మార్పులు అధికమైతే వచ్చే నెలలోనే రోజుకు ఐదు లక్షల కేసులు నమోదు కావటం ఖాయమని తెలిపింది. పరిస్థితులను బట్టి సెప్టెంబరు నుంచి అక్టోబరు చివరి నాటికి ఎప్పుడైనా దేశంలో మూడో వేవ్ కనిపించొచ్చని చెప్పింది. మొదట్నించి చెబుతున్నట్లుగా.. చిన్నారులపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుందని చెప్పటానికి ఆధారాలు ఎక్కడా లేవని పేర్కొంది.

ఒకవేళ మాత్రం పిల్లలకు ఎక్కువగా సోకితే మాత్రం వారికి సరిపడా వైద్య సౌకర్యాలు దరిదాపుల్లో కూడా లేవని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ ప్రోగ్రాం మందకొడిగా సాగటంపైనా ఈ నివేదిక చర్చించింది. ప్రస్తుతం 7.6 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయి టీకాలు వేసుకున్నారని.. ఇది పెరగకపోతే రోజుకు ఆరు లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. గతంలో 67 శాతం మంది దేశ ప్రజలకు ఇన్ ఫెక్షన్ ద్వారా కానీ.. వ్యాక్సినేషన్ ద్వారా కానీ రోగనిరోధశక్తి పెంచుకుంటే మూడో వేవ్ తీవ్రత ఎక్కువ ఉండేది కాదని.. మారిన పరిస్థితులు.. వైరస్ ఉత్పరివర్తనాలు.. వ్యాక్సిన్లను కూడా తప్పించుకోగలుగుతున్న తీరు చూస్తే.. హెర్డ్ ఇమ్యూనిటీ అన్నదిప్పుడు సంక్లిష్టంగా మారిందని చెబుతన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో 80 నుంచి 90 శాతం మందికి రోగనిరోధకశక్తి వస్తే తప్పించి హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమయ్యే సూచనలు లేవననారు. మూడో వేవ్ వస్తే అది తొలుత వ్యాక్సిన్ తీసుకోని పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుందన్న మాట వినిపిస్తోంది. థర్డ్ వేవ్ ఎదుర్కోవటానికి ఇప్పటి నుంచే సమాయుత్తం కావాల్సిందేనని నివేదిక స్పష్టం చేసింది. సో.. కేర్ ఫుల్ గా ఉండాల్సిన సమయం వచ్చేసిందన్న మాట.