Begin typing your search above and press return to search.

వణుకు పుట్టే మాట.. భారత్ లో మూడో వేవ్ ఉధృతి అప్పుడేనట

By:  Tupaki Desk   |   5 Jan 2022 2:30 PM GMT
వణుకు పుట్టే మాట.. భారత్ లో మూడో వేవ్ ఉధృతి అప్పుడేనట
X
వచ్చేస్తుంది.. వచ్చేస్తుందనుకున్న కరోనా మూడో వేవ్ ముంగిట్లోకి వచ్చేసింది. అందుకు తగ్గట్లే.. కొత్త సంవత్సరం మొదటి నాలుగు రోజుల్లోనే కేసుల నమోదులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కరోనా మూడో వేవ్ ముప్పు ఒకవైపు.. మరోవైపు ఒమిక్రాన్ ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొదట వేసుకున్న అంచనాల ప్రకారం ఫిబ్రవరి మధ్యలో కరోనా మూడో వేవ్ మొదలవుతుందని.. అది కాస్తా అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పాలి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు..తాజాగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో థర్డ్ వేవ్ ఉధృతి అనుకున్న దాని కంటే ముందే వచ్చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. భారత్ లో మూడో వేవ్ ఉధృతి ఎప్పుడు ఉంటుందన్న విషయంపై ఒక అంచనాను వెల్లడించారు.అంతేకాదు.. ఒమిక్రాన్ విషయంలో కీలక హెచ్చరికలు చేశారు. ఒమిక్రాన్ అన్నది సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదు. అది ఆరోగ్య వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. కరోనా కేసులు అకస్మాత్తుగా.. భారీ సంఖ్యలో పెరుగుతున్నాయని.. పరీక్షలు చేయటం.. రోగుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం.. ఈ అంశాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

తాజాగా నెలకొన్నపరిస్థితుల నేపథ్యంలో.. భారత్ లో కేసుల సంఖ్య మరింత పెరగొచ్చని.. వచ్చే రెండు వారాల్లో మూడో వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. దీంతో.. వచ్చే రెండు వారాలు.. అంటే సంక్రాంతి పండుగ వారం.. ఆ తర్వాతి వారం విషయంలో అప్రమత్తంగా ఉంటే.. ఉధృతి నుంచి తప్పించుకునే వీలుందని చెప్పొచ్చు. సౌమ్య స్వామినాథన్ అంచనా ఇలా ఉంటే.. మరో సీనియర్ ఎపిడెమిలాజిస్ట్ గిరిధర్ మాట్లాడుతూ.. ఇప్పుడు పరిస్థితుల్లో జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి తొలి వారంలో కరోనా ఉధృతి ఉంటుందన్న అంచనా వేశారు.ఇదంతా చూస్తున్నప్పుడు.. మరో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్ప తప్పదు. సో.. బీకేర్ ఫుల్.