Begin typing your search above and press return to search.

ఆంజనేయుడు...ఆంధ్రుడే!

By:  Tupaki Desk   |   20 April 2021 12:30 PM GMT
ఆంజనేయుడు...ఆంధ్రుడే!
X
ఆంజనేయుడు .. భయం తొలగిపోవాలంటే ఒక్కసారి ఆ హనుమాన్ ను తలచుకుంటే సరిపోతుంది. నిజమైన స్వామి భక్తికి నిదర్శనం. ధైర్యానికి, అభయానికి మరో నిర్వచనం. రామబంటు గా పురాణాల్లో గొప్ప పేరు తెచ్చుకున్న హనుమంతుడి జన్మస్థలంపై వివాదం రాజుకుంది. ఆంజనేయుడిన జన్మస్థలం ఎక్కడనే ఒక్క ప్రశ్నకు ఎన్నో సమాధానాలు. కొందరు మహారాష్ట్రల్లో అంటుంటే, మరికొందరు గుజరాత్ అంటున్నారు. ఇంకొందరైతే జార్ఖండ్‌ లోనే హనుమంతుడు జన్మిండానికి కొత్త వాదనలు వినిపిస్తున్నారు. అయితే , అవేవీ కావు హనుమంతుని జన్మస్థానం తిరుమలేనని, అంజనాద్రే మారుతి పుట్టిన ప్రాంతమని టీటీడీ ప్రకటించింది. అంజనాద్రిలోనే ఆంజనేయుడు పుట్టాడంటున్న టీటీడీ… అందుకు చారిత్రక ఆధారాలున్నాయని, వాటిని శ్రీరామనవమి రోజు బయటపెట్టనుంది.

ఇదిలా ఉంటే .. ఆంజనేయుడి జన్మ స్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రి అని తిమ్మసముద్రం సంస్కృత పాఠశాల రిటైర్డ్‌ అధ్యాపకులు, హనుమద్‌ ఉపాసకులు అన్నదానం చిదంబరశాస్త్రి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన చిదంబరశాస్త్రి హనుమజ్జయంతిపై పీహెచ్ ‌డీ చేసి.. ఆధారాలతో సహా నిరూపించినట్టు వెల్లడించారు. ద్వారకా పీఠాధిపతి కర్ణాటకలోని హంపి ప్రాంతం ఆంజనేయుని జన్మస్థలంగా ప్రస్తావించారని, అయితే దానికి ఎలాంటి అధరాలు కూడా లేవు అని చిదంబరశాస్త్రి వివరించారు. 1972 నుంచి హనుమంతుని ఉపాసన చేస్తున్న చిదంబరశాస్త్రి పలు తాళపత్ర గ్రంథాలను పరిశీలించిన తర్వాత, వాటిని తెలుగు, ఇంగ్లీష్ లోకి కూడా అనువదించినట్టు తెలిపారు. ఆ తర్వాత హనుమంతుని జన్మస్థలానికి సం బంధించి పీహెచ్ ‌డీ కూడా చేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే తిరుమలలోని అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలంగా నిరూపణ అయినట్టు తెలిపారు. 1980 నుంచి 1999 వరకు అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించాలని సంతకాల సేకరణను ఉద్యమంలా నిర్వహించామన్నారు. అప్పటి టీటీడీ ఈవో వినాయకరావుకు పంపించామని, జాపాలి మహర్షి తపస్సు చేసింది కూడా అక్కడేనని, ఆ కారణంగానే ఆ ప్రదేశాన్ని జాపాలితీర్థం అంటారని తెలిపారు. ఆంజనేయుడు ఆంధ్రుడని, తిరుమల అంజనాద్రి పర్వతంపై జన్మించారని నిరూపించటమే నా జీవితలక్ష్యం అని చిదంబరశాస్త్రి తెలిపారు.