Begin typing your search above and press return to search.

మీ ఇంట్లో గొడుగులు భద్రం.. ఫ్యూచర్లో వాటితో చాలానే పని

By:  Tupaki Desk   |   1 May 2020 12:30 AM GMT
మీ ఇంట్లో గొడుగులు భద్రం.. ఫ్యూచర్లో వాటితో చాలానే పని
X
గొడుగు లేని ఇల్లు ఉండకపోవచ్చు. ఎండల్లో వాడేటోళ్లు కాస్త తక్కువే. వాన కురిస్తే అందరూ ఇంట్లో దాచిన.. గొడుగుల్ని బయటకు తీసేస్తుంటారు. ఎండా.. వానా అన్న తేడా లేకుండా రానున్న రోజుల్లో అందరూ గొడుగులు తీయక తప్పని పరిస్థితి. కరోనా పుణ్యమా అని రానున్న రోజుల్లో గొడుగుల డిమాండ్ పెరిగిపోనుంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత భౌతికదూరాన్ని పాటించటానికి గొడుగుకు మించిన సాధనం ఉండబోదు.

గొడుగు గొప్పతనాన్ని గుర్తించిన తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ విజయ్ కార్తికేయన్ తాజాగా ఆసక్తికర ఆదేశాల్ని జారీ చేశారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు రావాలనుకునే వారు గొడుగుల్ని తప్పనిసరిగా వాడాలని సూచించారు. గొడుకు.. గొడుగుకు మధ్యనున్న దూరంతో భౌతిక దూరం ఆటోమేటిక్ గా వచ్చేస్తుందన్నది ఆయన ఆలోచన.

మరికొన్ని రోజుల్లో పాక్షికంగా లాక్ డౌన్ ఎత్తేసే అవకాశం ఉన్న నేపథ్యం లో.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటోళ్లు తప్పని సరిగా గొడుగు వాడాలన్న నియమం పెట్టే అవకాశం ఉందంటున్నారు. పెద్దగా ఖర్చు లేకుండా.. ప్రజలందరూ ఒకే పద్దతిని ఫాలో కావటానికి గొడుగుకు మించింది మరొకటి ఉండదంటున్నారు. లాక్ డౌన్ వేళలోనే కాదు.. తర్వాత కూడా గొడుగు చాలానే సాయం చేసే వీలుంది. అందుకే.. ఇంట్లో ఉన్న గొడుగుల్ని భద్రంగా చూసుకోండి. దుమ్ము పట్టి ఉంటే.. దులిపి సిద్ధం చేసుకోండి.