Begin typing your search above and press return to search.
రోజుకు 30 సిగరెట్లు.. హాయిగా 113 ఏళ్లు
By: Tupaki Desk | 29 Jan 2016 1:30 AM GMTసిగరెట్లు - చుట్టలు - బీడీలు తాగితే ఆరోగ్యం పాడవుతుందని... క్యాన్సర్లు వచ్చి అకాల మరణం తప్పదని అంటారు. వైద్యపరిశోధనలూ ఇదే నిజమని చెబుతున్నాయి. సిగరెట్లు తాగడమే కాదు.. పక్కనుంచి ఆ పొగ పీల్చినా కూడా ప్రమాదమే. అలాంటిది 96 సంవత్సరాలుగా రోజుకు 30 సిగరెట్లు ఊదేస్తున్న బామ్మగారు మాత్రం చీకూచింతా లేకుండా 113 ఏళ్లు వయసులోనూ హాయిగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేపాల్ కు చెందిన ఈ బామ్మ ఇప్పుడు వైద్యరంగానికే సవాల్ విసురుతోంది.
నేపాల్ రాజధాని ఖాట్మండ్ సమీపంలోని ఒక గ్రామంలో ఉంటున్న 113 ఏళ్ల ఈ వృద్ధురాలి పేరు బతులీ. తనకు 17 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి అంటే 96 ఏల్లుగా ఈమె బీడీలు సిగరెట్లు తాగుతోంది. రోజుకు 30 సిగరెట్లు కనీసం తాగుతుంది. అంతకంటే ఒక్కటి తక్కువైనా ఆమె ప్రాణం గిలగిల కొట్టుకుంటుందట.
సిగరెట్లు తాగడం వల్ల రోగాలు వస్తాయి కదా అంటే అదేం లేదని... సిగరెట్టే తన ఆరోగ్య రహస్యమని... అందుకే తాను ఇంతకాలం బతికానని వాదిస్తోందామె.