Begin typing your search above and press return to search.
ఈ 3 నిమిషాల వీడియో మీకో అద్భుతమైన బిజినెస్ ఐడియా ఇవ్వొచ్చు
By: Tupaki Desk | 16 Nov 2021 4:58 AM GMTమూడంటే మూడు నిమిషాల చిట్టి వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ప్రముఖ మీడియా సంస్థ రాయటర్స్ సంస్థ రూపొందించిన ఈ చిట్టి వీడియో సరికొత్త బిజినెస్ ఐడియాను ఇవ్వటమే కాదు.. సదరు దేశంలో ఆ ఐడియా వర్కువుట్ అయ్యింది.
ఒక విధంగా చూడాలంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఈ కొత్త బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశమే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఈ సక్సెస్ ఫుల్ బిజినెస్ ఐడియా ఏమిటి? అన్నది చూస్తే..
నైజీరియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఇఫిడేలాపో రాన్ సేవే అనే మహిళ ఒక కంపెనీని షురూ చేసింది. దాని పేరు ప్రిటెన్ వేస్ట్ మేనేజ్ మెంట్ రీసైకిలింగ్. రెండేళ్ల క్రితం కేవలం ఇద్దరంటే ఇద్దరు వ్యక్తులతో దీన్ని ప్రారంభించారు. చిన్న షెడ్డులో ప్రారంభమైన ఈ బిజినెస్ ఇప్పుడు కొత్త అవకాశాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రోడ్డు పక్కన.. చెత్తకుప్పల్లో.. డ్రైనేజీ కాలువల్లో పడి ఉన్న పాత టైర్లను సేకరించి.. వాటిని రీసైక్లింగ్ ప్లాంట్ కు తీసుకొస్తారు. ప్రత్యేక పద్దతిలో కరిగించి పేవ్ మెంట్ బ్రిక్స్ గా తయారు చేస్తారు.
ఈ బ్రిక్స్ ను పేవ్ మెంట్ మీద.. పార్కులు.. పాఠశాలలు ఇలా ఎక్కడైనా సరే వినియోగించేందుకు వీలుగా రూపొందించారు. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ.. మరోవైపు వేస్టు గా పడి ఉన్న టైర్లతో అందరికి ఉపయోగపడేలా బ్రిక్స్ ను తయారు చేయటం అందరిని ఆకర్షించింది. దీంతో.. సదరు కంపెనీకి ఆర్డర్లు పెద్ద ఎత్తున రాసాగాయి. దీంతో.. అప్పటివరకు పాత మెషిన్లతో పని చేస్తున్న దానికి బదులుగా కొత్త మెషిన్లను తీసుకొచ్చి ఉత్పత్తిని షురూ చేశారు. అయినప్పటికీ డిమాండ్ కు తగ్గట్లుగా బ్రిక్స్ ను సరఫరా చేయలేకపోతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రోడ్ల పక్కన.. కాల్వల వద్ద.. ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేసే పాత టైర్లను కనిపించిన వెంటనే తీసుకొచ్చి ఆమె కంపెనీకి ఇస్తున్నారు. ఒక్కో పాత టైరుకు మన రూపాయిల్లో రూ.15 చొప్పున ఆమెచెల్లిస్తున్నారు. కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయిన పలువురు.. పాత టైర్లను వెతికి తీసుకొచ్చే పని మొదలు పెట్టారు. ఇలా కుప్పలుగా ఉండే పాతటైర్లు ఇప్పుడు ఆమె కంపెనీకి చేరి.. అందమైన బ్రిక్స్ గా మారిపోతున్నాయి. తనకు పెరిగిన ఆర్డర్లకు తగ్గట్లుగా బ్రిక్స్ ను తయారు చేసేందుకు వీలుగా ఇప్పుడామె కంపెనీలు ఏకంగా 128 మంది ఉద్యోగులయ్యారు. బ్రిక్స్ తోపాటు ఇతర ఉత్పత్తుల్ని కూడా అందిస్తున్న రాన్ సేవే ఆలోచన సరికొత్తగా ఉంటమే కాదు.. వేస్టుగా పడి ఉండే వాటితో బ్రిక్స్ తయారు చేసే ఆలోచన.. ఏ దేశంలో అయినా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెప్పక తప్పదు.