Begin typing your search above and press return to search.
అంబరీష్ స్థానంలో సుమలతకు టికెట్..
By: Tupaki Desk | 31 Jan 2019 10:08 AM GMTకన్నడ సినీ నటుడు, దివంగత ఎంపీ అంబరీష్ మృతితో కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి అంబరీష్ సతీమణి, సినీ నటి సుమలతకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంబరీష్ తో పాటు సుమలత సినిమా ఫీల్డులో పేరు గాంచిన నటి. భర్తతో పాటు ఆమె సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. దీంతో కాంగ్రెస్ సుమలతకు టికెట్ ఇస్తే సానుభూతితో పాటు సినీ వర్గంతో పాటు అన్నివైపుల నుంచి ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. మాండ్య నియోజకవర్గం గౌడలకు పట్టున్న ప్రాంతం. దీంతో అటు జేడీఎస్ కూడా తమ అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు, నిఖిల్ ను బరిలో నిలబెట్టాలని చూస్తోంది. నిఖిల్ కూడా నటుడు కావడంతో ఆయనకు సినీ వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని అనుకుంటున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ సపోర్టుతోనే జేడీఎస్ అధికారంలో ఉంది. దీంతో ఈ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ జేడీఎస్ కు వదిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే మొదటి నుంచి అంబరీష్ కాంగ్రెస్ లో మంచి పట్టు సాధించారు. ఆయన మృతితో ఈ నియోజకవర్గం శోకసంద్రంలో మునిగింది. అందువల్ల ఇదే తరుణంలో సుమలతను బరిలోకి దించడం వల్ల కాంగ్రెస్ కు సీటు ఖాయమయ్యే అవకాశాలున్నాయి.
ఇదే జరిగితే జేడీఎస్ ఓ ఎంపీ సీటును కోల్పోవాల్సి వస్తుంది. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ నుంచి సుమలతకు టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ గా సుమలత పోటీ చేస్తుందని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు.