Begin typing your search above and press return to search.

ఈ యాడ్ భలేభలే.. పొద్దున్నే లేవగానే జీవితమంతా కళ్లముందు

By:  Tupaki Desk   |   29 May 2022 11:30 PM GMT
ఈ యాడ్ భలేభలే.. పొద్దున్నే లేవగానే జీవితమంతా కళ్లముందు
X
ఈ రోజు ఉయదమే ఓ ప్రధాన పత్రిక చూడగానే.. ఆశ్చర్యమనిపించింది. అంతగా ఆకట్టుకున్నది ఒక యాడ్. అది కూడా నిత్యవసరాలు సరఫరా చేసే ఓ యాప్ గురించి. మన దైనందిన జీవితమంతా ప్రతిబింబించేలా ఆ యాడ్ ఉండడం ఇక్కడ విశేషం. వాస్తవానికి పత్రికల్లో చాలామంది తొలుత చూసేది పాకెట్ కార్టూన్ ను. ఈ రోజు మాత్రం మొదటిపేజీ నిండా కార్టూన్ లతో వచ్చిన యాడ్ చూసి ఆశ్చర్యపోవడం ఖాయం.

బాల్యం గురుతులన్నీ చిన్నప్పుడు స్కూలు ఎగ్గొట్టాలంటే ఏం చేసేవారం..? నకిలీ జ్వరం కోసం చంకలో ఉల్లిపాయలు పెట్టుకునేవారం. పిల్లలు ఆటలాడుతుండగా దెబ్బ తగిలితే పెద్లలు పసుపు రాసేవారు.

ఇక దేవుడి దగ్గర అగర్ బత్తి వెలిగించాలంటే అరటి పండును స్టాండ్ గా పెట్టేవారు. దోమలు రాకుండా నిమ్మకాయల్లో లవంగాలు గుచ్చి ఉంచేవారు. పెద్దయ్యాక తలుచుకుంటే.. కచ్చితంగా ఇవన్నీ అందరికీ బాల్యంలో తీపి గురుతులే.

అవే కాదు.. ఇవీ..కళ్లల్లోకి కమలా పండు తొక్కులు ఒత్తుకోవడం.. గిన్నెలు శుభ్రం చేయడానికి కొబ్బరి పీచు వాడకం.. దుస్తులకు పురుగు పట్టకుండా ఎండు మిరపకాయలు వాడడం.. ఇవన్నీ సగటు భారతీయ సమాజంలో సాధారణం. వీటన్నిటినీ కలిపి యాడ్ గా ఇవ్వడమే క్రియేటివిటీ. ఈ సందర్భాలన్నటికీ తగినట్లుగా ఓ బాలుడి కార్టూన్ గీయించి ప్రచురించడంతో పాఠకులను మరింత ఆకట్టుకుంది.

చేసిందెవరెంటే...?మార్కెట్ లో ప్రస్తుతం ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ మాంచి ఊపు మీదున్న రంగాలు. ఒక్కో సంస్థ ఒక్కో రకమైన ఆఫర్లతో పోటీ పడుతున్నాయి. కొన్ని క్రెడిట్ కార్డుల మీద ఆఫర్లు ఇస్తుండగా మరికొన్ని నెలవారీ చందాలపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ గ్రాసరీ డెలివరీ యాప్ భాగా ప్రాచుర్యం పొందింది. కస్టమర్లను మరింత ఆకట్టుకునేందుకు తాజాగా మరింత క్రియేటివిటీతో యాడ్ ఇచ్చింది.