Begin typing your search above and press return to search.
సూర్యుడినే మింగేసే బ్లాక్ హోల్ ఇదే!
By: Tupaki Desk | 5 July 2020 3:53 AM GMTఈ అనంత విశ్వంలో మన ఊహకు అందని వింతలూ విశేషాలు లెక్క లేనన్ని ఉన్నాయి. అటువంటి వింతల్లో ఒకటి బ్లాక్ హోల్...అంటే కృష్ణబిలం లేదా కాలబిలం లేదా కాల రంధ్రం. బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలో ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే ప్రాంతం. బ్లాక్ హోల్ ఆకర్షణ నుండి - ఏ కణమూ తప్పించుకోలేదు. కాంతి వంటి బలమైన విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏదీ బ్లాక్ హోల్ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అటువంటి బ్లాక్ హోల్ తో మానవాళికి ముప్పు తప్పదన్న వాదన చాలా కాలంగా వినిపిస్తోంది. తాజాగా ఆ బ్లాక్ హోల్ గురించి శాస్త్రవేత్తలు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. విశ్వంలో అతిపెద్ద బ్లాక్ హోల్ లో ఒకటైన అల్ట్రా-భారీ బ్లాక్ హోల్ `SMSS J215728.21–360215.1` నానాటికీ భారీ పరిమాణంలో పెరిగిపోతోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం J2157 గా ప్రాచుర్యం పొందని ఈ బ్లాక్ హోల్...ప్రతిరోజూ సూర్యుడితో సమానమైన ద్రవ్యరాశిని మింగేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమి నుంచి 12.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మన పాలపుంత (మిల్కీ) గెలాక్సీ మధ్యలో J2157ను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అల్ట్రామాసివ్ బ్లాక్ హోల్…సూర్యుని కంటే అధిక ద్రవ్యరాశికలిగి ఉందని, అత్యంత ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పారు. ఉంది. పౌర్ణమి కంటే 10 రెట్లు ప్రకాశవంతంగా కనిపించే J2157...సూర్యుడిని అమాంతం మింగేయగలదని చెబుతున్నారు. రోజుకు ఒక సూర్యుడి ద్రవ్యరాశి చొప్పున మింగేయగల సామర్థ్యం ఈ బ్లాక్ హోల్ సొంతమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. J2157 బ్లాక్ హోల్ ద్రవ్యరాశి పాలపుంత మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ కంటే 8,000 రెట్లు పెద్దదిగా ఉంటుందని ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టోఫన్ ఓన్ కెన్ తెలిపారు. పాలపుంత బ్లాక్ హోల్ ఇలానే పెరిగిపోతుంటే.. మన గెలాక్సీలోని నక్షత్రాలలో మూడింట రెండు వంతులు మింగేస్తుందని వెల్లడించారు.