Begin typing your search above and press return to search.

ఈ బ్లడ్ గ్రూప్ వారికి వైరస్ బాధ తక్కువట !

By:  Tupaki Desk   |   11 Jun 2020 4:15 AM GMT
ఈ బ్లడ్ గ్రూప్ వారికి వైరస్ బాధ తక్కువట !
X
చైనాలో వెలుగులోకి వచ్చిన ఓ కంటికి కనిపించని వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. రోజు రోజుకి వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ నుంచి కాపాడేందుకు అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే , ఇంతవరకు ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయాయి. ఇంకా ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ ఖచ్చితమైన సమయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. వ్యాక్సిన్ తయారు చేద్దామన్నా వైరస్ తన రూపాలను మార్చుకొంటూ దారుణంగా తయారవుతోంది.

అందరిలో ఒకే రకమైన లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు? అని 23 అండ్‌ మీ అనే జెనెటిక్ టెస్టింగ్‌ సంస్థ అధ్యయనం చేయగా కీలక విషయం వెల్లడైంది. ప్రిలిమినరీ ఫలితాలను బట్టి.. ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు వైరస్ కు అంతగా ప్రభావితం కావడం లేదని తేలిందట.మిగతా బ్లడ్ గ్రూప్‌లతో పోల్చితే ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలో 9 నుంచి 18 శాతం మంది వైరస్ బారిన పడుతున్నారని సంస్థ వివరించింది. దాదాపు 8 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసిందన్నారు.

అయితే తమ అధ్యయనంలో పూర్తి ఫలితాలు ఇంకా రాలేదని, ఇవి కేవలం ప్రారంభస్థాయిలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. మరోవైపు మార్చి నెలలో జరిపిన పరిశోధనలోనూ సరిగ్గా ఇలాంటి ఫలితాలే వచ్చాయని తెలిపింది.టైప్ ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు తక్కువ సంఖ్యలో వైరస్ బారిన పడితే.. టైప్ ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నట్టు వెల్లడైంది. కానీ, దీనిపై స్పష్టమైనా అధారాలకు సంబంధించిన వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.