Begin typing your search above and press return to search.

ఈ గుడిలో పిజ్జా, బ‌ర్గ‌ర్లే ప్ర‌సాదం

By:  Tupaki Desk   |   28 March 2017 5:31 PM GMT
ఈ గుడిలో పిజ్జా, బ‌ర్గ‌ర్లే ప్ర‌సాదం
X
హిందు సంప్రదాయాల‌ను విశ్వ‌సించే వారు సాధార‌ణంగా దేవాల‌యాల‌కు వెళితే ముందుగా పూజ చేయించుకుంటారు. అలా పూజ ముగిసిన వెంట‌నే పూజారి ప్ర‌సాదం పెడ‌తాడు. అంటే చ‌క్కర పొంగ‌ళి - పులిహోరా - ద‌ద్దోజ‌నం - గుగ్గిళ్లు - ల‌డ్డూలాంటివి. అయితే ఆధ్యాత్మిక టూరిజంలో అగ్ర‌స్థానంలో ఉన్న త‌మిళ‌నాడు రాష్ట్రంలోని జ‌య‌దుర్గ పీఠం ఆల‌యంలో ఈ సంప్ర‌దాయం కాస్త అప్ డేట్ అయిన‌ట్లుంది. ప్ర‌సాదం విష‌యంలో అన్ని దేవాల‌యాల‌కు భిన్నంగా పాశ్చాత్య దేశ‌పు తిండి అయిన‌ బ‌ర్గ‌ర్లు - సాలడ్లు - కేకులు ఇస్తున్నారు. అది కూడా మెషిన్ల రూపంలో కావ‌డం ఆస‌క్తిక‌రం. భ‌క్తుల‌కు ప్ర‌సాదం ఇచ్చేందుకు ఆల‌య ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్యేక‌మైన మెషీన్ల‌ను ఏర్పాటు చేశారు.

జ‌య‌దుర్గ పీఠానికి వెళ్లిన భ‌క్తులు పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం ప్ర‌సాదం కావాలంటే ఆల‌య పూజ‌రి ఇవ్వ‌డు. భ‌క్తులే సంబంధిత మెషీన్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఓ టోకెన్‌ ను అందులో వేస్తే ఆటోమేటిక్‌ గా బ‌ర్గ‌ర్లు - సాలాడ్లు - కేకులు ప్ర‌సాదం రూపంలో చ‌క్క‌గా ప్యాకెట్ల‌లో మెషీన్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాయి. అలా అని ఆషామాషీగా కూడా ఏమీ నిర్వ‌హించ‌డం లేదు. ఈ ప్ర‌సాదానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)వారిచే స‌ర్టిఫై కూడా చేయ‌బ‌డింది. ఈ ప్ర‌సాదాల‌పై ఎక్స్‌ పైరీ డేట్ కూడా ప్రింట్ చేయ‌డం జ‌రిగింది. ఇలా కొత్త రూపంలో ప్ర‌సాదం అందించ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే ఈ దేవాల‌యంలో బ‌ర్త్ డే వేడుక‌ల‌కు సైతం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. పుట్టిన రోజులు జ‌రుపుకునే వారికోసం ఆ ఆల‌యం ఆవ‌ర‌ణ‌లోనే ప్ర‌త్యేక మెషీన్లు పెట్టారు. అందులో టోకెన్ వేస్తే ఏకంగా బ‌ర్త్‌ డే కేకులే ప్ర‌సాదం రూపంలో బ‌య‌టికి వ‌స్తాయి. ఇలా మెషీన్ల ద్వారా ప్ర‌సాదం అంద‌జేయ‌డం విజ‌యవంతం అయింద‌ని, చ‌క్క‌టి స్పంద‌న వ‌స్తోంద‌ని ఆల‌య అధికారులు చెబుతున్నారు. మ‌హిళ‌లు - వృద్ధులు ప్ర‌సాదం కోసం గంట‌ల త‌ర‌బ‌డి వేచిచూడాల్సిన ప‌నిలేద‌ని వారు చెప్పారు. పైగా నాణ్య‌త‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని వివ‌రించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/