Begin typing your search above and press return to search.

ఈ చైనా ఫోన్ల కంపెనీ ఏకంగా రూ.2217 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగొట్టింది!

By:  Tupaki Desk   |   3 Aug 2022 4:54 PM GMT
ఈ చైనా ఫోన్ల కంపెనీ ఏకంగా రూ.2217 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగొట్టింది!
X
చైనా మొబైల్ ఫోన్ల కంపెనీ వీవో భారత్ లో కస్టమ్స్ సుంకం ఎగ్గొట్టిన వైనం వెలుగుచూసింది. వివో మొబైల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఏకంగా రూ.2217 కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది. దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయని డీఆర్ఐ వెల్లడించింది.

దర్యాప్తులో భాగంగా వివో ఇండియా ప్రాంగణాల్లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో ఈ సుంకం ఎగవెట్టిన వైనం వెలుగుచూసింది. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కోసం వస్తువుల విలువను తక్కువగా చూపిన కారణంగా ఒప్పో కంపెనీకి డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ నోటీసులు జారీచేసింది. మొత్తం రూ.4389 కోట్లు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని నోటీసుల్లో పేర్కొనగా.. ఇందుకుగాను ఆ కంపెనీ రూ.450 కోట్లు డిపాజిట్ చేసినట్లు చెప్పారు.

డిక్లరేషన్ చేయకుండా.. డిస్క్రిప్షన్ లేకుండానే వివో ఇండియా భారీగా ఐటెమ్స్ ను దిగుమతి చేసినట్టుగా ఆధారాలు లభ్యమయ్యాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.

చైనాకు చెందిన వివో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ అనుబంధ కంపెనీయే వివో ఇండియా లిమిటెడ్. మొబైల్ హ్యాండ్ సెట్స్, యాక్సెసరీస్ తయారీ, అమరిక, హోల్ సేల్ ట్రేడింగ్ తోపాటు మొబైల్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తోంది.

ఇక షావోమీ కంపెనీకి మూడు నోటీసులు జారీచేసినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. సుమారు రూ.653 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా.. ఆ కంపెనీ రూ.46 లక్షలు మాత్రమే డిపాజిట్ చేసిందని తెలిపారు. పన్ను ఎగవేత విషయంలో వివో ఇండియాకు రూ.2217 క్ోట్లు పన్ను చెల్లించాలని నోటీసులు పంపించగా.. రూ.60 కోట్లు డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు.

కస్టమ్స్ సుంకం ఆరోపణలపై షావోమీపై 5 కేసులు నమోదు చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల పార్లమెంట్ కు తెలిపారు. 2019-22 మధ్య కాలంలో ఇలాంటి మరో 43 ఇతర కంపెనీలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కేసులు నమోదు చేసిందని పార్లమెంట్ కు వివరించారు.