Begin typing your search above and press return to search.
రాజకీయాలకు ఓవైసీ గుడ్ బై..కారణం తెలిస్తే షాకే
By: Tupaki Desk | 2 Dec 2018 1:37 PM GMTఎంఐఎం నేత - ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. సందర్భం ఏదైనా ఆయన తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. ఇటీవలే రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రి పదవిపై కూర్చునే నేతలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మజ్లిస్ తలుచుకుంటేనే ముఖ్యమంత్రి ఎవరైనా తమ వద్దకు రావాల్సిందేనన్నారు. ఏ ముఖ్యమంత్రి అయిన తమ ముందు తలవంచాల్సిందేనని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న అక్బరుద్దీన్ ఈ సందర్భంగా పరుషమైన పదాలతో ఎద్దేవా చేశారు. ఇలాంటి కలకలం చేసే కామెంట్లకు చిరునామా అయిన ఓవైసీ తాజాగా పాలిటిక్స్ కు గుడ్ బై చెప్తానన్నారు.
యాకూత్ పుర ఎన్నికల సభలో ఎంఐఎం నేత - చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ఇవే తనకు చివరి ఎన్నికలు కావచ్చని అన్నారు. తన ఆరోగ్యం అస్సలు బాగా లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. ``కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా. నా కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఉన్నాయి. కొన్ని రోజుల కిందట పరిస్థితి చేయి దాటి పోయింది. డాక్టర్ నన్ను డయాలసిస్ చేసుకోమన్నారు`` అని అక్బరుద్దీన్ చెప్పారు. నా ఆరోగ్యాన్ని చూసుకునే సమయం దొరకడం లేదు. స్కూళ్లు, దారుసలాం బ్యాంకులు - హాస్పిటల్స్ చూసుకోవడానికే సరిపోతుంది అని ఆయన తెలిపారు.
అయితే ఆయనకు ఆరోగ్యం కొంత బాలేదన్న మాట నిజమే గాని... ఎన్నికలు వదలేయడం కచ్చితంగా నిజం కాదు. ఇలాంటి సెంటిమెంట్లు ప్లే చేసి అమాయకుల ఓట్లను తమ కన్నీటి ద్వారా కొల్లగొట్టడం ఒవైసీలకు అలవాటే. ప్రతి ఎన్నికల్లో వారు సభల్లో ఇలాగే కంటతడి పెడుతుంటారు. ఈసారి ఆరోగ్యం అనే సాకును అడ్డుగా పెట్టుకున్నారు.