Begin typing your search above and press return to search.

నగ్నంగా వీడియో కాల్స్ .. 200మందికి మోసం చేసిన ఆ జంట !

By:  Tupaki Desk   |   27 Oct 2021 1:30 AM GMT
నగ్నంగా వీడియో కాల్స్ .. 200మందికి మోసం చేసిన ఆ జంట !
X
మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం....మోసం చేసేవారు ఉండనే ఉంటారు. అవతలి వారి వీక్ నెస్ తెలిస్తే చాలు. ఇట్టే తెలివిగా మోసం చేసేస్తారు. తాజాగా ఓ కిలాడీ జంట చాలా తెలివిగా దాదాపు 200మందిని మోసం చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌ లోని ఘాజియాబాద్‌ కు చెందిన సప్నాగౌతమ్‌, యోగేశ్‌ భార్యాభర్తలు. వీరికి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆశ పుట్టింది. దీంతో ఆ దంపతులకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ రికార్డు చేసి బాధితుల నుంచి డబ్బులు లాగొచ్చని సలహా ఇచ్చాడు.

దీంతో సప్నా గౌతమ్‌, యోగేశ్‌ జంట ఈ దందాలోకి దిగింది. యోగేశ్ వ్యక్తుల వివరాలు సేకరించడంతో ఆ వివరాలతో వీడియో కాల్స్ ఎలా మాట్లాడలో కొంతమంది యువతులకు సప్నా శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. దీని కోసం వీరు ముందుగా ఓ వెబ్సైట్‌ సాయంతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడేవారు. దానికి నిమిషానికి రూ.200పైగా ముందుగానే చెల్లించాలని చెప్పేవారు. ఇందులో సగం వెబ్సైట్ వారికిపోగా మిగిలిన సగం ఈ దంపతులకు చేరుతుంది. తర్వాత ఆ రేటు కంటే తక్కువకే తాము వీడియో కాల్స్ చేస్తామంటూ బాధితుల నుంచి ఫోన్ నంబర్లు సేకరించేవారు. వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాల్లో వీడియో కాల్స్ చేసి, అవతలి వారు నగ్నంగా మాట్లాడేలా చేసి రికార్డు చేసేవారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకుంటే, వారి వీడియోలు బయట పెడతామని బాధితులను బెదిరించేవారు.

ఇలా ఎంతో మందిని మోసం చేసి గత రెండేళ్లుగా సుమారు రూ.22 కోట్లను పలువురు బాధితుల నుంచి దోచుకున్నారు. యువతులను రిక్రూట్ చేసుకుని వారికి నెలకు రూ.25 వేల చొప్పున జీతాలు చెల్లించి నగ్న వీడియో కాల్స్‌ చేయించారు. కేవలం మెసేజ్లు చేసే వారికి నెలకు రూ.15వేలు ఇచ్చేవారు. ఓ కంపెనీకి చెందిన ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుంచి బదిలీ చేయడంతో ఆ కంపెనీ యజమాని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ జంట దందా వెలుగులోకి వచ్చింది. ఆ కేసు విచారణలో రాజ్‌కోట్‌ పోలీసులు ఘజియాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేస్తుంటే హనీ ట్రాప్ విషయం బయటపడింది. ఈ కేసులో భార్యాభర్తలు సహా, మరో ముగ్గురు యువతులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.