Begin typing your search above and press return to search.
ఏ పార్టీని దెబ్బకొడుతుందో ఈ ‘డేరా’
By: Tupaki Desk | 8 Feb 2022 11:32 AM GMTఇపుడిదే అంశంపై చర్చలు బాగా పెరిగిపోతున్నాయి. జనాల్లో చర్చలు పెరిగిపోతుంటే రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ ఈ డేరా ఎవరంటే డేరా సచ్చా సౌదా అధినేత లేదా ఆశ్రమాధిపతి డేరాబాబా ఉరఫ్ రామ్ రహీమ్ గుర్మీత్. డేరా బాబా గా బాగా పాపులరైన ఈ బాబాకు పంజాబ్, హర్యానాలో కోట్లాది మంది డై హార్డ్ భక్తులు లేదా ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అని ఎందుకంటున్నామంటే ఈయన కొన్ని సినిమాల్లో కూడా నటించారులేండి. ఈయనే నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి అందులో తానే హీరోగా వేశారు.
పై రెండు రాష్ట్రాల్లో ఈయన చాలా పాపులర్ కాబట్టే రాజకీయ పార్టీలన్నీ ఈయన చుట్టూనే తిరుగుతుంటాయి. ఇలాంటి బాబాపైన హత్యలు, అత్యాచారాలు, హత్యాచారాల ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. విచారణలో అవన్నీ నిరూపణ కూడా అయ్యాయి. దాంతో హర్యానా కోర్టు ఈయనకు కఠిన శిక్ష విధించింది. దీంతో ఐదేళ్ళుగా హర్యానాలోని రోహతక్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న బాబా హఠాత్తుగా బెయిల్ పై సోమవారం రిలీజ్ అయ్యారు.
పంజాబ్ ఎన్నికలకు ముందు బాబా జైలు నుంచి ఎందుకు బెయిల్ పై రిలీజయ్యారో అర్థం కావటం లేదు. ఎందుకంటే పంజాబ్ లోని మాల్వా ప్రాంతంలో ఈయనకు అపారమైన పట్టుంది. పంజాబ్ లోని 117 సీట్లలో 69 సీట్లు మాల్వా ప్రాంతంలోనే ఉన్నాయి. పై ప్రాంతంలో బాబా ఎవరికి ఓట్లేయమంటే వారికి వేసే భక్తులు లక్షల్లో ఉన్నారు. అంటే ఈయన గానీ ఒక ఈలగానీ వేస్తే అన్నట్లుగా పలానా పార్టీకి ఓట్లేయమంటే కచ్చితంగా ఆ పార్టీ అభ్యర్ధులు గెలిచే అవకాశాలున్నాయి.
పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. లేదు లేదు తామే మళ్ళీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నమ్మకంగా చెబుతోంది. బీజేపీని ఎవరూ అసలు లెక్కల్లోకే తీసుకోవటం లేదు. ఈ పరిస్థితుల్లో కావాలనే బీజేపీయే బాబాను అవసరం కోసం బెయిల్ మీద రిలీజ్ చేయించిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అయితే బాబా విడుదలకు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. మరి ఈ బాబా ఏమి చేస్తారో చూడాలి.