Begin typing your search above and press return to search.
ఈ తండ్రి కూతుళ్లు సో స్పెషల్.. చదివాక వావ్ అనేస్తారు
By: Tupaki Desk | 6 July 2022 3:19 AM GMTఇప్పటివరకు దేశంలో మరే తండ్రి కూతురు సాధించలేని ఘనతను తమ సొంతం చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇదో రేర్ పరిణామంగా చెప్పాలి. ఇంతకీ ఈ అరుదైన ఘనతను సాధించింది మరెవరో కాదు భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మ.. ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ. వీరిద్దరూ కలిసి ఫైటర్ జెట్ ను నడిపి రికార్డును క్రియేట్ చేశారు. ఒక యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రి కూతుళ్లుగా వీరిద్దరూ రికార్డుల్లో నిలిచారు.
ఆడపిల్ల పుట్టిందంటే అరకొర చదువులతో ఇంటికే పరిమితం చేసే స్థాయి నుంచి.. గడిచిన కొద్దికాలంగా వారి అభిప్రాయాలకు విలువను ఇచ్చి.. వారు కోరుకున్న చదువుల్ని చదివిస్తున్న తండ్రులు ఎక్కువ అయ్యారు.
దీనికి నిలువెత్తు నిదర్శనంగా సంజయ్ శర్మను కూడా చెప్పాలి. 1989లో వైమానిక దళంలో చేరిన ఆయన.. తండ్రి బాటను పట్టింది ఆయన కుమార్తె అనన్య శర్మ. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని భావించిన ఆమె.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బీటెక్ పూర్తి చేశారు.
2016లోవైమానిక దళం మొదటి మహిళా ఫైటర్ పైలట్ల టీంలో సభ్యురాలైన అనన్య.. తర్వాత ఫ్లయింగ్ బ్రాంచ్ శిక్షణకు ఎన్నికైంది. కఠిన శిక్షణ పొందిన ఆమె గత ఏడాది డిసెంబరులో ఫైటర్ పైలెట్ గా నియామకాన్ని పొందారు. ఇటీవల కర్ణాటకలోని బీదర్ ఎయిర్ ఫోర్సు స్టేషన్ లో హాక్ 132 ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ తండ్రి కూతుళ్లు కలిసి ప్రయాణించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
ఒక మిషన్ కోసం తండ్రి.. కుమార్తె ఒక యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించటం ఇదే తొలిసారిగా వైమానిక దళ అధికారులు చెబుతున్నారు. భారత వైమానిక దళం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక తండ్రి.. కుమార్తెలు ఇద్దరు ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించటాన్ని అరుదైన ఘట్టంగా అభివర్ణిస్తున్నారు.
ప్రయాణం అనంతరం వారు ప్రయాణించిన యుద్ధ విమానం ముందు వీరిద్దరూ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ తండ్రి కూతుళ్లను అభినందించటమే కాదు.. ఇలాంటి అరుదైన ఉదంతాలకు మరిందరు తండ్రులు ముందుకు రావాలని ఆశిద్దాం.