Begin typing your search above and press return to search.

ఏంటి ఈ ముద్దుల జాతర.. ?

By:  Tupaki Desk   |   1 March 2020 12:30 AM GMT
ఏంటి ఈ ముద్దుల జాతర.. ?
X
జాతర ... అంటే పసుపు కుంకుమలతో బోనాలు... డప్పు చప్పులు శివసత్తుల పూనకాలు... ఇలా హోరెత్తిపోతు ఉంటుంది. అలాంటి జాతర జరిగే సమయంలో ఊరు ఊరంతా కలిసి ఆడి, పాడి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే జాతరలో చిన్న , పెద్ద అన్న తేడా కూడా పెద్దగా ఉండదు. అందరూ కలిసిపోయి పండుముసలి వాళ్లు కూడా , యువకుల్లా రెచ్చిపోతుంటారు. ఇక, తమ ఇష్ట దైవానికి పూజలు, పునస్కారాలు, ఊరేగింపులు, సేవలు, బలులు , రథం ఇలా.. ఆ జాతర జరిగినన్ని రోజులు, రోజుకో రకంగా ఆ దేవతల్ని కొలుస్తూ జాతరని చాలా అట్టహాసంగా జరుపుకుంటుంటారు. కొన్ని చోట్ల రెండు మూడు రోజుల్లో జాతర ముగిస్తే ..కొన్ని జాతర్లు వారాల పాటు సాగుతుంటాయి. ఇలాంటి జాతర్లు సర్వసాధారణం.

కానీ , బళ్లారి పరిసర ప్రాంతాల్లో పదేళ్ల కొకసారి ఓ విచిత్రమైన జాతర జరుగుతుంది. అసలు ఆ జాతర ప్రత్యేకత ఏమిటి అంటే ... ఆ జాతరకు వెళ్లే భార్యాభర్తులు కలిసి డ్యాన్స్ చేయడం, అలాగే చుట్టూ జనాలంతా గుమ్మిగూడి చూస్తున్నా, పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటూ వయసుతో సంబంధం లేకుండా భార్యభర్తలు కలిసి డ్యాన్స్ చేయాలి. అక్కడ ఏళ్ల తరబడి ఈ ఆచారం కొనసాగుతోంది.

ఈ జాతర గురించి పూర్తి వివరాలు చూస్తే ....కర్ణాటక రాష్ట్రంలోని దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి గ్రామంలో... ప్రతీ పదేళ్లకోసారి గ్రామ దేవత ఊరమ్మ దేవి జాతర నిర్వహిస్తారు.. ఈ గ్రామ దేవత జాతరలో భక్తులు జంటలుగా డ్యాన్స్‌ చేయడం, ముద్దులు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ముఖ్యంగా పెళ్లయిన దంపతులు ఇలా జాతరలో డాన్సులు చేస్తూ తెగ ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రం ఇది పబ్లిక్ రొమాన్స్ గా అనిపించినప్పటికీ...ఈ వింత ఆచారాన్ని పాటించక పోతే అమ్మవారు సంతృప్తి చెందదు అని స్థానికులు చెప్పడం విశేషం. అలాగే అక్కడి ఆచారాన్ని పాటిస్తూ ..దంపతులు ముద్దులు పెట్టుకుంటూ డ్యాన్సులు వేస్తే అమ్మవారు సంతోషించి , వారు కోరిన కోర్కెలు నిరవేరేలా చేస్తుంది అక్కడి ప్రజల నమ్మకం. ఈ విచిత్రమైన ముద్దుల జాతర ..శుక్రవారం అంగరంగ వైభవంగా జరిపారు.