Begin typing your search above and press return to search.

వానాకాలం ఏవీ తినాలి.. ఏవీ తినకూడదో తెలుసా.?

By:  Tupaki Desk   |   15 July 2020 3:45 AM GMT
వానాకాలం ఏవీ తినాలి.. ఏవీ తినకూడదో తెలుసా.?
X
అసలే ఇది కరోనా కాలం.. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దానికి తోడు వానాకాలం వచ్చేసింది. రోగాలు మోసుకొచ్చింది. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని అయినా చేయగలం.. వానాకాలంలో కలుషిత నీరు, దోమలు, ఈగలు వృద్ధి చెంది రోగాలు వేగంగా వ్యాపిస్తాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ఈ కాలంలో ఎక్కువ ప్రమాదం.. మ‌న శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల‌నే అనేక ర‌కాల అనారోగ్యాల బారిన ప‌డ‌తామ‌ని అంద‌రికీ తెలిసిందే. కొంద‌రికి ఈ శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రికొంద‌రికి వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో ఇలాంటి వారు త‌ర‌చూ అనారోగ్యాల బారిన ప‌డ‌తారు. అయితే కింద చెప్పిన ఆహారం త‌ర‌చూ తింటుంటే దాంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గడ‌మే కాదు, అనారోగ్యాలు రాకుండా జాగ్ర‌త్త ప‌డవ‌చ్చు. ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

*ఉల్లిపాయ‌లు, వెల్లుల్లి...
ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని క‌చ్చితంగా తీసుకోవాలి. వీటిలో బాక్టీరియా, వైర‌స్‌ల‌తో పోరాడే గుణాలు ఉన్నాయి. దీంతో శరీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి అనారోగ్యాలు రావు.

*తేనె...
తేనెలో కూడా యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉన్నాయి. దీన్ని త‌ర‌చూ తింటూ ఉంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు.

*పెరుగు...
పెరుగులోనూ యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. క‌నుక పెరుగును రోజూ ఆహారంలో భాగంగా తింటుంటే అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త తీసుకోవ‌చ్చు.

*నిమ్మ‌జాతి ఫ‌లాలు...
నారింజ‌, కివీలు, ద్రాక్ష, పైనాపిల్, ఉసిరి, స్ట్రాబెర్రీ వంటి నిమ్మ‌జాతి ఫ‌లాల‌ను ఎక్కువ‌గా తినాలి. ఎందుకంటే వీటిలో ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో ఉండే బాక్టీరియా, వైర‌స్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడి వాటిని నాశ‌నం చేస్తుంది. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డ‌మే కాదు, అనారోగ్యాలు కూడా రావు.

*బాదం ప‌ప్పు...
బాదం ప‌ప్పును రోజూ తింటున్నా శ‌రీర రోగ‌ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే వీటిని రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే పొట్టు తీసి తింటే మంచిది. దీంతో పోష‌కాలు కూడా అందుతాయి.