Begin typing your search above and press return to search.

దేశంలో అత్యధిక మెజార్టీ ఈయనదే..

By:  Tupaki Desk   |   27 May 2019 10:36 AM GMT
దేశంలో అత్యధిక మెజార్టీ ఈయనదే..
X
అఖండ విజయం సాధించిన మోడీకి అంత మెజార్టీ దక్కలేదు.. ఏపీని స్వీప్ చేసిన జగన్ వల్ల అది కాలేదు. కానీ ఒక్క ఎంపీ వల్ల మాత్రమే సాధ్యమైంది. దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు బద్దలు కొట్టిన ఆ మొనగాడైన ఎంపీ ఎవరో కాదు.. గుజరాత్ లోని నవ్ సర్ లోక్ సభకు పోటీచేసిన బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్. ఆయన తన సమీప కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి దర్మేష్ భాయ్ పటేల్ పై ఏకంగా 6.9లక్షల ఓట్ల తేడాతో గెలిచి రికార్డులు బద్దలు కొట్టారు. వరుసగా మూడోసారి ఈయన ఇక్కడి నుంచి ఎంపీగా గెలవడం విశేషం.

పాటిల్ ఇప్పుడేకాదు.. 2014లోనూ 5.57లక్షల మెజార్టీ సాధించడం విశేషం. ప్రధాని మోడీకి వారణాసిలో 4.97లక్షల మెజార్టీ రాగా.. అమిత్ షాకు గాంధీనగర్ లో 5.57లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది.

పాటిల్ గుజరాత్ నుంచి గెలిచినా ఆయన స్వస్థలం మాత్రం మహారాష్ట్రంలోని జలాగన్. పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. అంతేకాదు.. 1989లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీహార్ బీజేపీ ఇన్ చార్జిగా ఉన్నారు.

ఇక గుజరాత్ రాష్ట్రంలో ఉన్నా ఇక్కడ మరాఠీల జనాభా ఎక్కువ. ఈయన కూడా మరాఠీ కావడంతో అత్యధిక మెజార్టీ సాధ్యమైంది. ఈయన 74.77 కోట్లతో బీజేపీలో ధనవంతుడైన ఎంపీల్లో ఒకడిగా ఉన్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే వారణాసిలో మోడీ గెలుపు కోసం కూడా అక్కడ కృషి చేశారు.