Begin typing your search above and press return to search.
రాజగోపాల్ కు పెద్ద షాకే ఇది
By: Tupaki Desk | 13 Oct 2022 5:26 AM GMTమునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి అల్లవరం గ్రామప్రజలు పెద్ద షాకిచ్చారు. చౌట్టుపల్ మండలంలోని అల్లవరం గ్రామానికి ప్రచారం కోసం రాజగోపాల్ వెళ్ళారు. అయితే అభ్యర్ధిని ప్రచారం చేయనీయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. 2018 ఎన్నికల సమయంలో గ్రామాభివృద్ధికి రాజగోపాల్ ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. ప్రభుత్వంతో సంబంధంలేకుండా సొంతనిధులతో అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు.
అలాగే చౌట్టుపల్ మండలాన్ని అభివృద్ధి చేయమని ఓట్లేసి గెలిపిస్తే రు. 18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయి కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేస్తావా ? అంటు జనాలు మండిపోయారు.
కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన నీకు ఉపఎన్నికలో పాల్గొనే అర్హత లేదంటు జనాలు రెచ్చిపోయారు. జనాలను వారించేందుకు రాజగోపాల్ ప్రయత్నించినపుడు వాళ్ళింకా మండిపోయారు. రాజగోపాల్ డౌన్ డౌన్ అంటు గట్టిగా నినాదాలు చేయటంతో చేసేదిలేక రాజగోపాల్ గ్రామంలో నుండి వెళ్ళిపోయారు.
తర్వాత మీడియాతో మాట్లాడుతు తనను అడ్డుకున్నది గ్రామస్తులు కాదని ప్రత్యర్ధి పార్టీలే అంటు మండిపోయారు. తనను ప్రచారం చేయనీయకుండా అడ్డుకుంటున్నారంటే తన గెలుపు ఖాయమైనట్లే అని రాజగోపాల్ విచిత్రమైన లాజిక్ వినిపించారు.
గతంలో కూడా రాజగోపాల్ ను ప్రచారం చేసుకోనీయకుండా నాలుగు గ్రామాల్లో అడ్డుకున్న విషయం తెలిసిందే. రాజగోపాల్ ను అసలు ప్రచారానికి కూడా రావద్దని గ్రామాల ప్రజలు తెగేసి చెప్పేశారు.
అప్పట్లో తనను గెలిపిస్తే అధికారంతో సంబంధంలేకుండానే సొంత నిధులతో గ్రామలను అభివృద్ది చేస్తానని హామీలిచ్చారు. అంటే తన దగ్గర బాగా డబ్బుందని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవటంలో భాగంగానే ఇలాంటి హామీలిచ్చారు. దాన్ని నమ్మిన జనాలు రాజగోపాల్ ను గెలిపించారు. అయితే గెలిచిన తర్వాత మళ్ళీ ఆ గ్రామాలవైపు చూడలేదు. ఇపుడు రాజీనామా చేసి ఉపఎన్నికలు రావటంతో మళ్ళీ బీజేపీ అభ్యర్ధిగా ప్రచారం మొదలుపెట్టారు. దీనిపైనే జనాలు మండిపోతున్నారు. జనాల ట్రెండ్ ఇలాగే కంటిన్యు అయితే రాజగోపాల్ గెలుపు కష్టమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.