Begin typing your search above and press return to search.

ద‌క్షిణాదిలో ఇదో హాట్ టాపిక్ గురూ!

By:  Tupaki Desk   |   15 Dec 2022 3:30 PM GMT
ద‌క్షిణాదిలో ఇదో హాట్ టాపిక్ గురూ!
X
ఇత‌ర రాష్ట్రాల సంగ‌తి ఎలా ఉన్నా.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో వార‌సుల సంఖ్య పెరుగుతోంది. ఉత్త‌రాదిలో ఈ ప‌రిస్థితి పెద్ద‌గా లేద‌నే చెప్పాలి. అయినా.. ఇటీవ‌ల కాలంలోనే ఉత్త‌రాదిలో వార‌సులు పెరుగుతున్నారు. సీఎంల కుమారుడు.. మాజీ నేత‌ల కుమారులు ఇప్పుడుఅక్క‌డ కూడా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్నారు. కానీ, ద‌క్షిణాదిరాష్ట్రాల్లో మాత్రం వార‌సుల హ‌వా ఎప్పుడూ ఉంటోంది.

ముఖ్యంగా ఏపీ, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌ను తీసుకుంటే.. ముఖ్య‌మంత్రుల కుమారులు, మాజీ ముఖ్య‌మంత్రుల కుమారులు ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు. మంత్రులుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్నారు. ఏపీలో మాజీ సీఎం రాజ‌శేఖ‌రెడ్డి కుమారుడుగా ఇప్ప‌టికీ.. జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు గుర్తిస్తున్నారు. ఆయ‌నంటూ వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ పెంచుకోవాలని చూస్తున్నా.. ఇప్ప‌టికీ వైఎస్ కుమారుడిగానే గుర్తింపు ఎక్కువ‌గా ఉంది.

అదేవిధంగా మాజీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ కూడా పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2029 నాటికి ఈయ‌న కూడా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కావ‌డం త‌థ్య‌మ‌ని ఆ పార్టీ న‌నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, తెలంగాణ‌లోనూ కేసీఆర్ త‌న‌యుడు.. కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. ఈయ‌న‌ను కాబోయే ముఖ్య‌మం త్రిగా ఇప్ప‌టికే పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు.

కేవ‌లం ప్ర‌క‌ట‌న మాత్ర‌మే మిగిలి ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగులువేశారు కాబ‌ట్టి.. ఈ ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లోనే వ‌చ్చేస్తుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు.. త‌మిళ‌నాడులో ముఖ్య‌మంత్రి స్టాలిన్ త‌న వార‌సుడిగా ఉద‌య‌నిధిని ప్ర‌క‌టించ‌క‌పోయినా.. ప్ర‌స్తుతం ఆయ‌న‌ను మంత్రిని చేశారు. దీనిని బ‌ట్టి.. భ‌విష్య‌త్తులో డీఎంకే ప‌గ్గాలు ఉద‌య‌నిధి చేప‌ట్ట‌డం త‌థ్యం. ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించ‌డ‌మూ త‌థ్య‌మ‌నే మాట వినిపిస్తోంది.

ఇక‌, క‌ర్ణాట‌క‌లోనూ ఈ ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పైకి.. బీజేపీ వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు దూర‌మ‌ని చెబుతున్నా.. మాజీ సీఎం య‌డియూర‌ప్ప కుమారుడు, ప్ర‌స్తుత సీఎం.. బ‌స‌రాజ బిడ్డ‌లు.. రాజ‌కీయాల్లోనే ఉన్నారు. ఇక‌, మాజీ పీఎం దేవ‌గౌడ కుమారుడు కుమారస్వామి.. కీల‌క‌రోల్ పోషిస్తున్నారు. ఇలా.. ద‌క్షిణాదిలోని ఈ నాలుగు రాష్ట్రాల‌కు భావి ముఖ్య‌మంత్రులు రెడీగా ఉండడం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.