Begin typing your search above and press return to search.

అల‌ర్ట్ః ఇది కూడా కొవిడ్ ల‌క్ష‌ణ‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   27 April 2021 2:30 PM GMT
అల‌ర్ట్ః ఇది కూడా కొవిడ్ ల‌క్ష‌ణ‌మేన‌ట‌!
X
గ‌తేడాది వెలుగు చూసిన క‌రోనా వైర‌స్ కు.. ఇప్పుడు రూపు మార్చుకున్న మ్యుటేష‌న్ కు అస‌లు సంబంధమే లేకుండా పోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కొవిడ్-19 వైర‌స్ ఎన్నో విధాలుగా రూపాంత‌రం చెందిన సంగ‌తి తెలిసిందే. దాని ల‌క్ష‌ణాలు కూడా మారుతూ వ‌చ్చాయి. తాజాగా.. ఇప్పుడు మ‌రో ల‌క్షణం కూడా కొత్త‌గా వ‌చ్చి చేరిందట‌. ఉత్త‌ర ప్ర‌దేశ్ వైద్యులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం.

మొద‌ట్లో కొవిడ్ ల‌క్ష‌ణాలు అంటే.. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, వాస‌న తెలియ‌క‌పోవ‌డం వంటివి ఉండేవి. ఆ త‌ర్వాత చాలా ల‌క్ష‌ణాలు వ‌చ్చి చేరాయి. త‌ల‌నొప్పి, వాంతులు, విరేచ‌నాలు, ఒళ్లునొప్పులు, క‌ళ్లు రంగు మార‌డం వంటి సింప్ట‌మ్స్ కూడా కొవిడ్ బాధితుల్లో క‌నిపించాయి. అయితే.. ఇప్పుడు మ‌రో కొత్త ల‌క్ష‌ణం కూడా బ‌య‌ట ప‌డింది.

తీవ్ర నీర‌సం, ర‌క్తంలో ప్లేట్లు పడిపోవ‌డాన్ని కూడా కొవిడ్ ప్రాథ‌మిక ల‌క్ష‌ణంగా భావించాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారట‌ యూపీ డాక్ట‌ర్లు. ఈ సింప్ట‌మ్స్ తో ఆసుప‌త్రికి వ‌చ్చే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంద‌ని అంటున్నారు. ఓ కేసు విషయాన్ని ఉద‌హ‌రించిన వైద్యులు.. ఓ బాధితుడిలో 4.5 ల‌క్ష‌ల నుంచి వేగంగా 80 వేల‌కు ప్లేట్ లెట్లు ప‌డిపోయాయ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఆ త‌ర్వాత 20 వేల‌కు ప‌డిపోవ‌డంతో ప్రాణాలు కోల్పోయాడ‌ని తెలిపిన‌ట్టు స‌మాచారం.

అందువ‌ల్ల‌.. జ‌నాలు ఈ విష‌యాన్ని కూడా గుర్తించాల‌ని చెబుతున్నారట‌. ఈ ల‌క్ష‌ణాలను కొవిడ్ సూచ‌న‌లుగా భావించి, వెంట‌నే చికిత్స చేయించుకోవాల‌ని సూచిస్తున్నారట వైద్యులు.