Begin typing your search above and press return to search.

బిల్లుల కోసం న్యాయ పోరాటం.. జగన్ సర్కార్ కు ఇది అవమానం..

By:  Tupaki Desk   |   19 Jan 2023 1:10 PM GMT
బిల్లుల కోసం న్యాయ పోరాటం.. జగన్ సర్కార్ కు ఇది అవమానం..
X
ప్రభుత్వ తరుపున వచ్చే కాంట్రాక్టులను కొందరు ఎగబడి దక్కించుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వానికి పనిచేసి పెడితె బిల్లులు నమ్మకంగా వస్తాయని.. పలుకుబడి ఉన్న కాంట్రాక్లర్లు ప్రభుత్వ పనులు చేసి ఎలాగోలా బిల్లులు వసూలు చేసుకుంటారు. కానీ చిన్న చిన్న కాంట్రాక్లర్ల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం వారి సేవలను వినియోగించుకొని వారికి బిల్లులు చెల్లించడం లేదు. కొవిడ్ సమయంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి.

తమ బిల్లులు ఇవ్వాలని అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ఏకంగా మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సొంత పార్టీకి చెందిన నాయకుడి పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సామాన్య కాంట్రాక్లర్ల పరిస్థితి ఏంటి..? ఇది జగన్ సర్కార్ కు అవమానం కాదా..?

కొవిడ్ బాధితులకు ప్రభుత్వం ఉచితంగా భోజనం సరఫరా చేసింది. ఇందుకు సంబంధించి కొన్ని హోటళ్లకు భోజనం సరఫరా చేయాలని కాంట్రాక్టులను ఇచ్చింది. 2021 మే నుంచి ఆగస్టు 4 వరకు కొందరు టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు తమ సొంత డబ్బులతో కొవిడ్ బాధితులకు ఆహారాన్ని అందించారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామారాజు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రూ.85 లక్షల బిల్లులు ప్రభుత్వం బకాయి పడింది. వీటిని చాలాకాలం పెండింగులో ఉంచి రూ.45 లక్షలు చెల్లించింది. ఆ తరువాత పన్నులు, ఇతరాలు మినహాయించి ఇప్పటికీ చెల్లించడం లేదని బాధితుడు వాపోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రూ.30 వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి. వీటిలో ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీరు-చెట్టు పనులకు సంబంధించి రూ.731 కోట్లు పెండింగులో ఉన్నాయి. 2021 మే నెలకు ముందు ఖనిజాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో ఇసుక అమ్మకాలు చేపట్టారు. ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసిన వారికి రూ.250 కోట్లు చెల్లించాల్సి ఉంది. చిన్నా చితకా గుత్తే దారులకు రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ రంగంలో ఎంతో కొంత బకాయలు కనిపిస్తున్నాయి.

అయితే తాజాగా వైసీపీకి చెందిన నాయకులే తమ బిల్లులు రావడం లేదని రోడ్డెక్కుతున్నారు. ఎంతో శ్రమకోర్చి తమ సొంత డబ్బులతో ప్రభుత్వ పనులు చేస్తే తమకు బిల్లులు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కొందరు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. అయితే కొందరు అధికారులు మాత్రం బిల్లులు పెండింగులో లేవని అంటున్నారు. కానీ బాధితుల నిరసనపై మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇలా బాధితులంతా రెడ్డేక్కితే వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ తప్పదని కొందరు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.