Begin typing your search above and press return to search.

తాజ్ మ‌హ‌ల్ కు.. కాళేశ్వరానికి తేడా అదేన‌ట‌!

By:  Tupaki Desk   |   21 Jun 2019 9:40 AM GMT
తాజ్ మ‌హ‌ల్ కు.. కాళేశ్వరానికి తేడా అదేన‌ట‌!
X
తాజ్ మ‌హ‌ల్ ఏంది? కాళేశ్వ‌రం ఏంది? అస‌లేమైనా పోలిక ఉందా? అన్న డౌట్ వ‌చ్చిందా? రావ‌టం త‌ప్పు కాదు. కానీ.. ఇది చ‌దివితే పోలిక అర్థం కావ‌ట‌మే కాదు.. నిజ‌మే క‌దా? అనిపించ‌క మాన‌దు. అప్పుడ‌ప్పుడు కొన్నిసార్లు తాజ్ మ‌హ‌ల్ క‌ట్టించిందెవ‌రు? అని అడుగుతారు. ఆ వెంట‌నే షాజ్ హాన్ అని చ‌ప్పున చెప్పేస్తారు. ఆ వెంట‌నే తాజ్ మ‌హ‌ల్ క‌ట్టిందెవ‌రు? అన్న ప్ర‌శ్న రావ‌టం స‌మాధానం చెప్ప‌క పోవ‌టం జ‌రుగుతుంటుంది.

ప్రేమ‌చిహ్నంగా తాజ్ మ‌హ‌ల్ నిలిచిపోతే.. తెలంగాణ‌లోని ల‌క్ష‌లాది ఎక‌రాల్ని నీటితో త‌డిపే అతిపెద్ద ప్రాజెక్టు ఏద‌న్న మాట‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్టు అని చెప్పేయ‌టం ఖాయం. అంతేనా.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఇంత భారీ ప్రాజెక్టు దేశంలోనే ఇదే మొద‌టిగా చెబుతున్నారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న‌..అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును క‌ట్టించింది ఎవ‌రు? అన్నంతే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని చెప్పేస్తారు ఎవ‌రైనా.

మ‌రి.. ఈ ప్రాజెక్టు క‌ట్టిందెవ‌రు? అన్న ప్ర‌శ్న వేస్తే.. తెల్ల‌ముఖం వేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. హ‌రీశ్ రావు అన్న స‌మాధానం అంద‌రి నాలుక చివ‌ర రెఢీగా ఉంటుంది. ఆ మాట‌కు వ‌స్తే.. ఇవాళే కాదు.. భ‌విష్య‌త్తులోనూ ఈ విష‌యం ఇప్పటి మాదిరి రావ‌టం ఖాయ‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే.. తెలంగాణ‌లో క‌ష్ట‌ప‌డి ఫ‌లితం పొంద‌ని నేత ఎవ‌రైనా ఉన్నారంటే అది హ‌రీశ్ రావేన‌న్న మాట సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున ప్ర‌చార‌మ‌వుతోంది.

రాత్రి ప‌గ‌లు అన్న తేడా లేకుండా అదే ప‌నిగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు కోసం ప‌ని చేసి.. ఈ రోజు క‌నీసం ప్రాజెక్టు పూర్తి చేయ‌టంలో కీల‌క‌మైన హ‌రీశ్ రావు పేరు లేక‌పోవ‌టాన్ని స‌గ‌టు తెలంగావాది జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఉమ్మ‌డి పాల‌కులు దోఖా ఇవ్వ‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. మ‌నోడ్ని మ‌నోళ్లు హైలెట్ చేసుకోక‌పోవ‌టం ఏమిట‌న్న మాట తెలంగాణ‌వాదుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్పుడు చెప్పండి తాజ్ మ‌హ‌ల్ కు.. కాళేశ్వ‌రానికి మ‌ధ్య నున్న తేడా ఇప్ప‌టికైనా అర్థ‌మైందా?