Begin typing your search above and press return to search.

బట్టతల వారికి ఇది ఎంతో గొప్ప ఊరటనిచ్చే న్యూస్

By:  Tupaki Desk   |   27 May 2022 11:30 AM GMT
బట్టతల వారికి ఇది ఎంతో గొప్ప ఊరటనిచ్చే న్యూస్
X
బట్టతల.. ఇప్పుడు మగవారికి ఇదో పెద్ద సమస్య. 35 ఏళ్లు దాటగానే జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. 40 ఏళ్లకు ఖాళీ గుండుగా మారుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది హెయిర్ ప్లాంటేషన్ తో మళ్లీ తిరిగి మాములు జుట్టును తెచ్చుకుంటున్నారు. అయితే చాలా రిస్కీ.. ఏమాత్రం తేడా వచ్చినా ప్రమాదమే..

ఇక మన స్టార్ హీరోలు, ప్రముఖులు కూడా ఈ బట్టతలతో బాధపడినవారే.. వారంతా హెయిర్ ప్లాంటేషన్ తోనే ఇప్పుడు మనకు నిండైన జట్టుతో కనిపిస్తున్నారు.. కొందరు విగ్గుతో కవర్ చేస్తున్నారు.

ఇలా ఇంతమందిని వేధిస్తున్న బట్టతల సమస్యకు అమెరికా శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. వారు చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు బట్టతల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.

బట్టతలతో నలుగురిలో తిరగలేని పరిస్థితి.. ఫ్రీగా ఉండలేని దుస్థితి. వారందరికీ గుడ్ న్యూస్ చెప్పారు అమెరికా శాస్త్రవేత్తలు. పోయిన జుట్టు మళ్లీ వచ్చేలా చేశారు. అమెరికాకు చెందిన డ్రగ్ కంపెనీ కాన్సర్ట్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఇదే మాట చెబుతోంది. బట్టతల ఉన్న వారికి ఆ కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. ఆ కంపెనీ సైంటిస్టులు ఓ ట్యాబ్లెట్ తయారు చేశారు. దాని పేరు సీటీపీ-543.

ఈ మాత్రను బట్టతల ఉన్న వారికి రోజుకు రెండు చొప్పున ఇచ్చారు. వారిలో మంచి ఫలితాలు కనిపించాయి. ఈ మాత్రతో జుట్టు రాలడం ఆగింది. అంతేకాదు.. పోయిన జుట్టు మళ్లీ వస్తోందని గుర్తించారు. ఈప్రయోగంలో పాల్గొన్న 10 మందిలో నలుగురు ఏడాది వ్యవధిలో 80శాతం కంటే ఎక్కువ జుట్టును తిరిగి పొందగలిగారని కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తెలిపింది.

ఈ డ్రగ్ కంపెనీ కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్ అమెరికాలో 706 మంది బట్టతల వ్యక్తులపై ప్రయోగం చేసింది. వారు మూడు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక గ్రూప్ లోని వారికి 8ఎంజీ ట్యాబ్లెట్ రోజుకు రెండు సార్లు ఇచ్చారు. మరో గ్రూప్ వారికి రోజుకి రెండు సార్లు 12 ఎంజీ మాత్ర ఇచ్చారు. దాదాపు 42శాతం మందిలో 12 ఎంజీ మోతాదు లేదా 8ఎంజీ మోతాదు తీసుకున్నప్పుడు కనీసం 80శాతం లేదా అంతకంటే ఎక్కువ జుట్టు తిరిగి పెరగడం గమనించారు. అయితే కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. తలనొప్పి, మొటిమలు వంటి దుష్ప్రభావాలతో బాధపడ్డారు. ఇది సీటీపీ-543 అనే అలోపేసియా ఔషధం క్లినికల్ ట్రయల్స్ చివరి దశ.

బట్టతల నివారణకు అనేక చికిత్సలు ఉన్నాయి. వాటన్నింటికి ఇదో మైలురాయిగా మేము భావిస్తున్నారు. ఈ బట్టతల బాధితులకు అత్యుత్తమ చికిత్సగా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.

ఈ ప్రయోగంలో దాదాపు సగం మందిలో ఆరునెలల్లో పూర్తి తల వెంట్రుకలు పెరిగినట్లు గుర్తించారు. ప్రస్తుత ప్రయోగదశలో ఉన్న ఈ ట్యాబ్లెట్ జుట్టు రాలుతున్న లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింపచేసింది. బట్టతల నివారణకు కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంలో ఇది ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.