Begin typing your search above and press return to search.
ఫ్లైట్‌లో ఫోన్.. నెట్.. అదిరే రేట్లుగా..?
By: Tupaki Desk | 25 Dec 2018 4:39 AM GMTచేతికి కొత్త ఆభరణంగా మారిన సెల్ ఫోన్ ను క్షణం తీరిక లేకుండా వాడేస్తున్న తీరు అందరికీ అనుభవమే. మారిన కాలానికి తగ్గట్లుగా వచ్చిన జీవనశైలి మార్పుల్లో ఫోన్ ను బాత్రూంలో కూడా వాడేస్తున్నారు. ఇలా.. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా ఫోన్ వాడేస్తున్నప్పటికీ ఇండియాలో ఫ్లైట్‌లో వెళ్లేటప్పుడు మాత్రం ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవటం మినహా చేసేదేమీ లేదు.
అయితే.. దానికి మంగళం పాడేస్తూ విమానంలోనూ ఫోన్ ను వాడే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన టారిఫ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ప్లైట్‌లో జర్నీ చేసేటప్పుడు రెండు గంటల పాటు ఫోన్.. ఇంటర్నెట్ ను వినియోగించుకోవటానికి కనిష్ఠంగా రూ.700 నుంచి గరిష్ఠంగా రూ.వెయ్యి వరకూ చెల్లించక తప్పదన్న మాటను చెబుతున్నారు.
ఫ్లైట్ లో ఫోన్ ను వినియోగించుకోవటానికి ఇతర దేశాల్లో ఇప్పటికే సౌకర్యం ఉండగా భారత్ లో మాత్రం ఈ సదుపాయం లేదు. పలుదేశాల టారిఫ్ తో పోలిస్తే.. భారత్ లో ఈ సేవల కోసం భారీ ఎత్తున ఛార్జ్ చేస్తున్నారన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది. ఎందుకిలా అంటే.. ఇస్రో నుంచి మాత్రమే ఫ్లైట్‌లో ఉండి ఫోన్ కాల్స్ చేసుకోవటానికి.. నెట్ వాడటానికి అవసరమైన శాటిలైట్ బ్యాండ్ విడ్త్ ను కొనుగోలు చేయాల్సి రావటమే కారణంగా చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ఫ్లైట్ ఛార్జీల ధరలు భారీగా తగ్గాయి. రూ.1500లకే ప్రయాణం చేసే పరిస్థితి అప్పుడప్పుడు ఉంది. ఈ లెక్కన ఫ్లైట్ టికెట్ ధర కంటే కూడా ఫోన్ టారిఫ్ లు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఇదే తీరులో టారిఫ్ అమలు చేస్తే మాత్రం.. ఫ్లైట్‌లో ఫోన్ వాడే కంటే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవటానికి ఎక్కువమంది మొగ్గు చూపిస్తారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఫోన్ వినియోగం ఇప్పుడో వ్యసనంగా మారిన వేళ.. ధర ఎక్కువ అయితే వాడరా? అన్న క్వశ్చన్ కు ఆసక్తికర ఆన్సర్ చెబుతున్నారు.
దేశంలో ఫోన్ వినియోగం.. డేటా వాడేయటం టారిఫ్ లు చౌకగా ఉన్నప్పుడే అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్లైట్లలో ఫోన్.. నెట్ వాడే వారు కేవలం 10 శాతం మందేనని చెబుతున్నారు. గూబ గుయ్యిమనేలా టారిఫ్ ల నేపథ్యంలో ఫ్లైట్ లో ఫోన్ వినియోగానికి ఎక్కువమంది ఆసక్తి చూపించే అవకాశం తక్కువగా ఉంటుందంటున్నారు.