Begin typing your search above and press return to search.

షాకింగ్‌ వీడియో.. ఆ దేశంలో విద్యార్థులు పరీక్షల్లో చీటింగ్‌ చేయకుండా ఇలా!

By:  Tupaki Desk   |   25 Oct 2022 6:19 AM GMT
షాకింగ్‌ వీడియో.. ఆ దేశంలో విద్యార్థులు పరీక్షల్లో చీటింగ్‌ చేయకుండా ఇలా!
X
విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఆయా విద్యా సంస్థలకు కత్తి మీద సాములాంటిది. అందులోనూ వివిధ జాతీయ ప్రవేశపరీక్షలు, ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలంటే తల ప్రాణం తోకకొస్తోంది. పరీక్ష పేపర్‌ లీక్‌ కాకుండా చూడటంతోపాటు విద్యార్థులు కాపీయింగ్‌ చేయకుండా చూడటం ఇంకా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో పరీక్షల సమయంలో నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

ఇటీవల నీట్‌ పరీక్షకు సంబంధించి మన దేశంలో కేరళలో విద్యార్థుల ఇన్నర్‌వేర్‌లకు స్టీల్‌ ఉందని చెప్పి వాటిని కూడా తొలగింపజేయడం వివాదాస్పదమైంది. ఇన్నర్‌వేర్స్‌ను తొలగించి పరీక్ష రాయించారని పలువురు విద్యార్థినులు ఆరోపించడం కలకలం రేపింది. అయితే తాము కాపీయింగ్‌ను నిరోధించడానికి నిబంధనల మేరకే ఇలా చేశామని పరీక్ష నిర్వాహకులు సమర్థించుకున్నారు.

ఇప్పుడు ఫిలిఫ్పీన్స్‌ దేశంలోనూ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వినూత్నంగా ఆలోచించాడు. పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకు ఒక ఐడియూ రూపొందించాడు. విద్యార్థులు పరీక్ష రాసేటప్పుడు తల కూడా తిప్పకుండా టోపీ లేదా వస్త్రం ధరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఇంకేముంది.. విద్యార్థులు కూడా రకరకాల టోపీలు, హెల్మెట్లు ధరించుకువచ్చారు. మరికొందరు పేపర్లతో రకరకాల చిత్రవిచిత్రమైన టోపీలను ధరించి పరీక్షలకు హాజరయ్యారు.

ఈ మేరకు పిలిప్పీన్స్‌లోని బికోల్‌ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రొఫెసర్‌ చేసిన వినూత్న ఆలోచనకు విద్యార్థులు తమదైన శైలిలో స్పందించారు. ’నో చీటింగ్‌’ పేరుతో పరీక్ష రాసే సమయంలో తలలు తిప్పకుండా రకరకాల టోపీటు, హెల్మెట్లు ధరించి పరీక్షకు హాజరయ్యారు.

ఈ క్రమంలో పేపర్లు, కార్డ్‌ బోర్డ్, ఎగ్‌ బాక్సెస్, రీసైకిల్డ్‌ మెటీరియల్‌ ఉపయోగించి వివిధ రూపాల్లో హెల్మెట్‌లా వాటిని ధరించి పరీక్ష రాశారు.

కాగా బికోల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో ధరించిన టోపీలు, హెల్మెట్‌లకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీటిపై యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మేరి జోయ్‌ మాండేన్‌ ఆర్టిజ్‌ మాట్లాడుతూ.. స్టూడెంట్స్‌ అందరూ కాపీ కొట్టకుండా నిజాయితీగా పరీక్ష రాయాలనే ఆలోచనతోనే ఈ విధానానికి రూపకల్పన చేసినట్టు తెలిపారు. గతంలో థాయ్‌లాండ్‌లో ఇలా చేయడం చూశానని, ఇప్పుడు దాన్నే తమ దేశంలోనూ అమలు చేశామని మాండేన్‌ ఆర్టిజ్‌ వెల్లడించడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.